నేటి కాలం యువత తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాల కంటే ప్రేమ పెళ్లిళ్లకే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోతే వారిని ఎదురించి మరీ వివాహం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు యువతి యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం విన్నాం. కానీ ఇద్దరు యువతులు ప్రేమించి పెళ్లి చేసుకున్న వార్త ఎప్పుడైనా విన్నారా? ఉత్తర్ ప్రదేశ్ లో అదే జరిగింది. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోయినా ఇది నిజం. వీరిద్దరి ఒప్పందంలో భాగంగా ఓ యువతి లింగమార్పిడి చేసుకుని మగవారిగా మారిపోయింది. ఆ తర్వాత ఆ యువతి ఇచ్చిన షాక్ కు లింగమార్పిడి చేసుకున్న యువతి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. ఈ ఇద్దరమ్మాయిల ప్రేమకథలో అసలేం జరిగిందనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీజిల్లాకు చెందిన సనా ఖాన్, సోనాల్ శ్రీవాత్సవ అనే ఇద్దరు యువతులు స్నేహితులు. వీరికి చాలా కాలం నుంచి పరిచయం ఉండడంతో వీరి స్నేహం రాను రాను ఇద్దరు ప్రేమించుకునేదాక వెళ్లింది. అలా కొన్నాళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగింది. ఇక ఇంతటితో ఆగకుండా వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇక అనుకున్నదే ఆలస్యం.. 2017లో వీళ్లు పెళ్లి కూడా చేసుకున్నారు. ఇదేకాకుండా సనా ఖాన్, సోనాల్ ఒప్పందం ప్రకారం ఇద్దరిలో ఒకరు మగవారిగా మారాలనుకున్నారు.
ఇందుకోసం సనాఖాన్ ఢిల్లీలో లింగమార్పడి చికిత్స చేసుకుని పురుషుడిగా మారిపోయింది. ఈ క్రమంలోనే సోనాల్ కు ఓ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. దీంతో ఆ యువతి రోజూ ఆఫీసుకు వచ్చి వెళ్లి వచ్చే క్రమంలోనే సోనాల్ కు ఆస్పత్రిలోనే ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో సోనాల్ ఆ యుకుడిని ప్రేమించింది. ఈ సమయంలోనే సోనాల్ సనా ఖాన్ ను పూర్తిగా దూరం పెట్టే ప్రయత్నం చేసింది. ఇదే విషయమై స్పందించిన సనాఖాన్.. సోనాల్ ను గట్టిగా ప్రశ్నించింది. దీంతో కోపంతో ఊగిపోయిన సోనాల్.. నేను నీతో కలిసి ఉండడం నా వల్ల కావడం లేదని, నువ్వు మళ్లీ అమ్మాయిగా మారిపోయి అని సూచించింది.
సోనాల్ మాటలు విన్న సనా ఖాన్ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక సోనాల్ పూర్తిగా దూరం పెట్టడంతో సనా ఖాన్ తట్టుకోలేకపోయింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని సనా ఖాన్.. నాకు న్యాయం చేయాలంటూ మే 30, 2022న కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన న్యాయస్థానం సోనాల్ కు నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం నోటీసులను సోనాల్ లెక్కచేయకపోవడంతో పోలీసుల సాయంతో కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణ అనంతరం ఆమెకు బెయిల్ రాగా, తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరగనుంది. ఈ ఘటనలో సనా ఖాన్ కు న్యాయం జరుగుతుందా? అసలేం జరగనుందనేది కాస్త ఆసక్తిగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.