అతనికి పదేళ్ల తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అప్పటి వరకు ఆ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కట్ చేస్తే.. భర్త భార్యపై రే*ప్ కేసు పెట్టాడు. వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. అసలేం జరిగిందంటే?
గుజరాత్ లో ఊహించని ఘటన వెలుగు చూసింది. ఓ భర్త తన భార్యపై రేప్ కేసు పెట్టాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎందుకు భార్యపై భర్త రే*ప్ కేసు పెట్టాడు? దాని వెనకాల అసలేం జరిగిందంటే? గుజరాత్ లోని సూరత్ లో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన పదేళ్లకు వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కానీ, ఎందుకో భర్తకు తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది.
వెంటనే భర్త భార్య సెల్ ఫోన్ పరిశీలించగా ఆమె మరొకరితో ఛాటింగ్ చేస్తున్నట్లు తేలిసింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగి ఆ తర్వాత నన్ను రెండవ వివాహం చేసుకున్నాడని తెలుసుకున్నాడు. ఇది తెలుసుకుని ఆ వ్యక్తికి ఒక్కసారిగా దిమ్మతిరిగింది. ఇవన్నీ బట్టి చూస్తే పుట్టిన పిల్లలు అసలు నాకే పుట్టారా అన్న అనుమానం అతడికి మరింత వెంటాడింది. ఇదే విషయంపై భార్యాభర్తలు తరుచు గొడవలు పడేవారు.
ఇక అసలు విషయం ఏంటో తేల్చుకునేందుకు ఆ భర్త ఇద్దరి పిల్లలకు DNA టెస్ట్ చేయించాడు. వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. ఓ కుమారుడు అతనికి పుట్టలేదని తేలింది. మరో కుమారుడు ఆ మహిళ మొదటి భర్తకు కాకుండా మరో వ్యక్తికి జన్మించాడని వెల్లడైంది. అనంతరం భర్త తట్టుకోలేక భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాడు. కానీ, పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదని తెలుస్తుంది. ఆ తర్వాత చేసేదేం లేక ఆ భర్త ఇటీవల కోర్టులో భార్యపై రే*ప్ కేసు పెట్టాడు. ఇది పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కట్టుకున్న మొగుడే భార్యపై రే*ప్ కేసు పెట్టిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.