పుత్రుడు పుడితే తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి కాపాడతాడనేది నానుడి. అలా పుత్రుడి కోసం ఎంతో ఎదురుచూసిన ఆ తండ్రికి ఐదుగురు అమ్మాయిల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. లేకలేక పుట్టిన ఆ పుత్రుడిని చూసికుని ఆ తండ్రి పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. కానీ, అతని ఆనందాన్ని చూసి విధి కూడా ఓర్వలేకపోయినట్లుంది. కేవలం 16 నెలలకే ఆ చిన్నారి వారికి దూరమయ్యాడు. కానీ, ఆ పిల్లాడి వల్ల ఇద్దరు చిన్నారుల ప్రాణాలు నిలబడ్డాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఉపిందర్ అనే వ్యక్తి ఢిల్లీలో కాంట్రాక్టర్‌గా చేస్తున్నాడు. అతనికి ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. అతను కొడుకు కోసం ఎంతో ఎదురుచూశాడు. ఐదుగురు సంతానం తర్వాత లేకలేక కొడుకు పుట్టాడు. అతనికి రిషాంత్ అని పేరు పెట్టుకున్నారు. రిషాంత్ వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. కానీ, అది ఎక్కువ రోజులు నిలువలేదు. ఆగస్టు 17న ఉదయం రిషాంత్ ఆడుకుంటూ కిందపడిపోయాడు.
అతని తలకు తీవ్రగాయం అయ్యింది. అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రిషాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రహించి అతడిని ఎయిమ్స్ కు రిఫర్ చేశారు. ఎయిమ్స్ లో జాయిన్ చేసిన వారం తర్వాత వైద్యులు రిషాంత్ ను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అవయవదానం చేసేందుకు ఒప్పించారు.
రిషాంత్ చేసిన అవయవదానంతో ఇద్దరు చిన్నారుల ప్రాణాలు నిలబడ్డాయి. అవయవాలు పూర్తిగా దెబ్బతిన్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రిషాంత్ కాపాడాడు. రిషాంత్ రెండు కిడ్నీలను ఎయిమ్స్ లో ఐదేళ్ల అబ్బాయికి అమర్చారు. రిషాంత్ కాలేయాన్ని మ్యాక్స్ ఆస్పత్రిలోని ఆరు నెలల చిన్నారికి అమర్చారు. అతని హార్ట్ వాల్వ్స్ ఎయిమ్స్ లో భద్రపరిచారు.
16 month old baby Rishant becomes youngest Organ Donor by saving 2 lives.
He fought for eight days but was unfortunately declared dead due to severe brain injury.
His kidneys have been transplanted in a 5-year-old boy, and his liver in a 6 months old girl. Om Shanti 🙏 ❤️🕉️ pic.twitter.com/oYpgZxjdVn
— Samrat Bhai (@BhaiiSamrat) August 26, 2022
రిషాంత్ ని గుర్తు చేసుకుంటూ అతని తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. “ఐదుగురు అమ్మాయిల తర్వాత మా కుటుబంలోకి రిషాంత్ అడుగుపెట్టాడు. అతనంటే మా అందరికీ ప్రాణం. అతని ఐదుగురు అక్కలు రిషాంత్‌ని ప్రాణంగా చూసుకునేవారు. ఇప్పుడు రిషాంత్ మాతో లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ రోజు ఉదయాన్నే పనుండి హడావుడిగా బయటకు వెళ్లాను. చివరిసారి రిషాంత్ ఎత్తుకోలేక పోయానే ఇప్పటికీ చింతిస్తున్నాను” అంటూ ఉపిందర్ తెలిపారు.
“రిషాంత్ లేకపోయిన అతని అవయవాలతో కొందరి ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు చెప్పనప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం. అలా అయినా మా అబ్బాయి బ్రతికే ఉన్నాడనే భావన మాకు ఉంటుంది. రిషాంత్ రెండు కుటంబాల్లో నవ్వులు పూయించాడు” అంటూ కుటుంబసభ్యులు వ్యాఖ్యానించారు. రిషాంత్ కుటుంబం చేసిన త్యాగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Delhi: 16 month old baby Rishant becomes youngest organ donor at AIIMS; saves many lives.
He fought for eight days after suffering severe head injury and his CT scan showed irreversible severe damage to the whole brain. pic.twitter.com/9WITUqYpTP
— Ravinder Chaudhary (@RavinderNatural) August 26, 2022