అమ్మ నవమాసాలు మోస్తే.. తండ్రి జీవితాంతం మోస్తాడు. కనిపించే అమ్మ ప్రేమను చూస్తారు గానీ.. పిల్లల కోసం అహర్నిశలు కష్టపడే నాన్నకు మాత్రం ఎలాంటి గుర్తింపు రాదు. అడిగినప్పుడల్లా పోపుల డబ్బాలోంచి తీసి అమ్మ డబ్బులిస్తుంది. కానీ, ఆ పోపుల డబ్బాలోకి డబ్బు రావాలంటే నాన్న రెక్కలు ముక్కలు చేసుకోవాలి. ఇవన్నీ అందరికీ తెలిసనే అనుకుంటారు. కానీ, ఎవ్వరూ నాన్న కష్టానికి విలువ ఇవ్వరు. కానీ, ఆ నాన్న మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఇప్పుడు తండ్రి గురించి ఇంతగా ఎందుకు చెబుతున్నామంటే.. అలాంటి ఒక గొప్ప తండ్రిని మీకు పరిచయం చేయడానికి. అతిని వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ జర్నలిస్ట్ చెప్పిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన రాజేశ్ అ వ్యక్తి రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నాడు. ఉపాధి కోసం బిహార్ నుంచి జబల్పూర్ కు వెళ్లాడు. జబల్పూర్లోనే ఒక అమ్మాయిని ప్రేమించి వివాహం కూడా చేసుకున్నాడు. అతనికి మూడేళ్ల కుమార్తె, ఏడాది బాబు కూడా ఉన్నారు. అయితే ఇటీవలే అతని భార్య మరో వ్యక్తి మోజులో భర్తను, పిల్లల్ని గాలికి వదిలేసింది. ప్రియుడితో కలిసి లేచిపోయింది. అయితే తండ్రి కూడా తన దారి తాను చూసుకోకుండా ఆ పిల్లలను అక్కున చేర్చుకున్నాడు. వారి ఆకలి తీర్చేందుకు ఎంత కష్ట పడుతున్నాడో చూస్తే కన్నీళ్లు ఆగవు. మూడేళ్లున్న కుమార్తెను ఇంటి వద్ద నిద్రపుచ్చి.. ఏడాది కొడుకుని తీసుకుని రిక్షా తొక్కేందుకు వెళ్తున్నాడు. నిద్రపోతున్న బాబుని ఒక భుజం మీద వేసుకుని.. మరో చేత్తో రిక్షా తొక్కుతున్న రాజేశ్ కథ కంటతడి పెట్టిస్తోంది. నేను రిక్షా తొక్కితే గానీ మా ముగ్గురు ఆకలి తీరదు అంటూ కష్టమైనా సరే రాజేశ్ ఇలా రిక్షా తొక్కుతూ పొట్టపోసుకుంటున్నాడు. ప్రస్తుతం సమాజంలో పెళ్లి, వైవాహిక బంధానికి ఉన్న విలువ ఎంత దిగజారిపోతోందో చూస్తూనే ఉన్నాం. కట్టుకున్న భర్త/భార్య, కడపున పుట్టిన పిల్లల కంటే మాయ మాటలు చెప్పి మోసం చేసే వాళ్లనే గుడ్డిగా నమ్ముతున్నారు. తుచ్యమైన క్షణిక సుఖంకోసం బంధాలు, బంధుత్వాలకు నీళ్లొదిలేస్తున్నారు. మన గురించి ఏమనుకుంటారో? పిల్లలు జీవితం ఏంటి అనికూడా ఆలోచన లేకుండా పాడు పనులు చేస్తున్నారు. రాజేశ్ కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. In an era of multitude of pro poor schemes, a man in MP's Jabalpur city, forced to drive cycle rickshaw while responsibly clutching infant son in one hand -- all to feed his family, comprising him, infant son and daughter. @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/D1VzrSHEu7 — Anuraag Singh (@anuraag_niebpl) August 25, 2022 ఇదీ చదవండి: నన్ను ఆంటీ అంటూ ఏడిపిస్తున్నారు! వాళ్ళ మాట విని కామ్ గా ఉంటున్నా: అనసూయ ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. బిడ్డకు పాలివ్వడం కూడా కామమే!