దేశంలో గత రెండేళ్ల నుంచి కరోనా ప్రభావం ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. కేవలం ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. నిరుద్యోగ శాతం మరింత పెరిగింది.. ఓ వైపు ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయని అంటున్నా నిరుపేదలు మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ కి తోడు బ్లాక్ ఫంగస్.. ఇతర వైరస్ లతో ప్రజలు సతమతమవుతున్నారు.
తాజాగా కేరళలోని కోజికోడ్ జిల్లాలో 12ఏళ్ల బాలుడు నిఫా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. కోజికోడ్ లో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ బాలుడు ఆదివారం ఉదయం 5గంటల ప్రాంతంలో చివరి శ్వాస వదిలాడు. విచిత్రంగా ఏ వైరస్ ప్రభావాలైన మొదట కేరళాలోనే పురుడు పోసుకుంటాయా అన్నట్టు.. ఆమద్య వచ్చిన నిఫా వైరస్ సహా ఇప్పుడు రచ్చ రేపుతున్న కరోనా వైరస్ కూడా అక్కడే మొదట నమోదావుతూ వచ్చాయి. తాజాగా కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ కేసు ప్రజలను భయకంపితులను చేస్తుంది.
నిఫా వైరస్ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికి వైరస్‌కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు. బాలుడి కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్ లో ఉన్నారు. కోజికోడ్ మొత్తం పూర్తి నిఘాలో ఉంది. ఆ బాలుడిని కలిసినవారిని గుర్తించే పనిని ప్రారంభించామని తెలిపారు. కాగా, కాగా, దేశంలో మొదటిసారిగా నిఫా కేసు కేరళలోని కోజికోడ్ జిల్లాలో 2018లో నమోదైంది. వైరస్ వల్ల నెల రోజుల వ్యవధిలో 17 మంది చనిపోగా, మరో 18 కేసులను రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది.
A case of Nipah virus has been detected in the Kozhikode district of Kerala. The Central Government has rushed a team of National Centre for Disease Control (NCDC) to the State to provide technical support: Government of India
— ANI (@ANI) September 5, 2021