ప్రార్ధించే పెదవులు కన్నా..సహాయం చేసే చేతులు మిన్న. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఓ మంచి మనసు ఉండాలి. ఇప్పుడు ఇలానే తన మంచి హృదయాన్ని చాటుకున్నారు టీడీపీ నేత నారా లోకేశ్. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లె గ్రామానికి చెందిన 8 ఏళ్ల చిన్నారి ఆటో డ్రైవర్ గా మారి.. కుటుంబ బాధ్యతలను మోస్తున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
తల్లిదండ్రులు అంధులు కావడంతో.. 8 ఏళ్ళ వయసున్న గోపాలకృష్ణారెడ్డి ఆటో డ్రైవర్ గా మారాడు. బ్యాటరీ ఆటోలో తల్లిదండ్రులను వెంటబెట్టుకుని, నిత్యావసరాలు తీసుకుని సమీప గ్రామాల్లో అమ్ముకుని రావడమే వీరి జీవనాధారం అయ్యింది. ఈ క్రమంలోనే గోపాలకృష్ణారెడ్డి చదువుకి దూరం అయ్యాడు.
గోపాలకృష్ణారెడ్డి పడుతున్న కష్టం అందరిని కలచి వేసింది. అయితే.. టీడీపీ నేత నారా లోకేశ్ మాత్రం వెంటనే గోపాలకృష్ణారెడ్డి కుటుంబానికి రూ.50 వేలు సాయం ప్రకటించారు. పిల్లాడి చదువు బాధ్యతనూ తానే తీసుకుంటానని మాట ఇచ్చారు. ఇంతేగాక.. బ్యాటరీ ఆటోపై ఉన్న రూ.2 లక్షలు అప్పుని కూడా తీరుస్తానని ట్విటర్‌లో ద్వారా తెలియచేశాడు. నారా లోకేశ్ చేసిన ఈ సాయానికి పార్టీలకి అతీతంగా అంతా ఆయన్ని అభినందిస్తుండటం విశేషం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.
Ask him to pack his bag because we’re getting him admitted to a school soon. We’ll also come together to help his family cover the EMI cost of the electric auto through a fundraiser towards which @JaiTDP pledges to contribute Rs. 50,000/- https://t.co/Q9q3F7maZE
— Lokesh Nara (@naralokesh) September 3, 2021