అయినవాళ్లు అందరూ ఉన్నా.. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ అంగన్ వాడీ టీచర్ చనిపోయి రెండ్రొజులైనా ఎవరూ గుర్తించలేదు. ఆ టీచర్ శవం చుట్టూ చీమలు పట్టినాయి. ఈ హృదయ విదార ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది.నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాశంవారిగూడెం గ్రామానికి చెందిన పాశం రాజేశ్వరి(60).. భర్త మూడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా రెండేళ్ల క్రితం కొడుకు చనిపోయాడు. దీంతో కోడలు.. పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయింది. ఆడపిల్లలు పెళ్లిళైయి అత్తారిళ్లలో ఉంటున్నారు.
ఇది కూడా చదవండి : తెలంగాణ ఆర్టీసీకి మహేశ్ బాబును ప్రచార కర్తగా మార్చిన సజ్జనార్
రాజేశ్వరి ఒక్కరే గ్రామంలో ఉంటూ అంగన్ వాడీ టీచరుగా పనిచేస్తున్నారు. గురువారం స్థానికులతో మాట్లాడిన ఆమె.. తర్వాత కనిపించలేదు. క్రిస్మస్ సెలవులు రావడం, ఆమె ఇల్లు కాలనీలో చివరన ఉండడంతో ఎవరూ అటుగా వెళ్లలేదు. అలాంటి సమయంలో ఆమెకు ఎప్పుడు గుండె పోటు వచ్చిందో కానీ వీధి అరుగు మీద కూర్చున్న ఆమె ఇంటి గుమ్మం మీదనే కుప్పకూలి చనిపోయింది. ఆదివారం ఉదయం అటూగా వెళ్తున్న ఓ అబ్బాయి చీమలు పట్టిన ఉన్న రాజేశ్వరి మృతదేహాన్ని చూసి స్థానికులకు చెప్పారు.
రెండు రోజుల క్రితమే గుండెపోటుతో చనిపోయినట్లు గ్రామస్థులు భావిస్తున్నారు. గుండె పోటు వచ్చిన సమయంలో ఆమె సొంత వారు దగ్గర ఉండి ఉండే చనిపోయేది కాదని, అందరూ ఉండి కూడా దిక్కులేక.. ఆ స్థితిలో ఆమె తలవాకిటే ముందు మరణించిందంటూ స్థానికులు బాధపడ్డారు. ఈసంఘటన పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : తెలంగాణ వ్యక్తిపై మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసల జల్లు