జార్ఖండ్ డైనమైట్, ది ఫినిషర్, కెప్టెన్ కూల్.. ఇలా చెప్పుకుంటూపోతే ఎంఎస్ ధోనీకి అభిమానులు పెట్టుకున్న పేర్లు ఎన్నో ఉంటాయి. భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా ధోనీ ఎన్నో ట్రోఫీలు తీసుకొచ్చాడు.. మరెన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. దిగ్గజాలు సైతం ధోనీ మా ఫేవరెట్ కెప్టెన్ అనే స్థాయికి ఎదిగాడు. ధోనీ క్రికెట్ కు వీడ్కోలు పలికినా.. క్రికెట్ మాత్రం ధోనీకి నీరాజనాలు పడుతూనే ఉంది. జులై 7న 41 వసంతాలు పూర్తిచేసుకుని 42వ వసంతంలోకి అడుగిడుతున్న ఎంస్.ధోనీకి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
క్రికెట్ దిగ్గజాలు మొదలు సెలబ్రిటీలు, రాజకీయనాయకులు సైతం సోషల్ మీడియాలో ధోనీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయన జీవితభాగస్వామి సాక్షీ ధోనీ మాత్రం భర్త పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. జులై 4న పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకునేందుకు లండన్ వెళ్లగా.. పుట్టిన రోజు వేడుకలను కూడా సాక్షీ అక్కడే ప్లాన్ చేశారు.
An idol & an inspiration 👏 👏
Here’s wishing @msdhoni – former #TeamIndia Captain & one of the finest to have ever graced the game – a very happy birthday. 🎂 👍 pic.twitter.com/uxfEoPU4P9
— BCCI (@BCCI) July 7, 2022
కేక్ కట్ చేస్తున్న వీడియో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. హ్యాపీ బర్త్ డే అంటూ కోట్ చేశారు. అంతేకాకుండా అందరి కలిసున్న ఫొటో ఒకటి స్టోరీలో షేర్ చేశారు. అందులో రిషబ్ పంత్ కూడా ఉండటం విశేషం. ఇంగ్లాడం టూర్ కోసం లండన్ లో ఉన్న పంత్.. ధోనీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ధోనీ కేక్ కటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. కామెంట్స్ రూపంలో ధోనీకి బర్త్ డే విషెస్ చెప్పేయండి.