నిజాన్ని తెలియజేసేది వార్త. కానీ.., ఈ డిజిటిల్ యుగంలో ఏ వార్త నిజమో, ఏ వార్త అబద్దమో తెలుసుకోకుండా అంతా సోషల్ మీడియాలో వార్తలను తెగ పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ సామాన్యులకి ఎంటర్టైన్మెంట్ గానే ఉన్నా.., సెలబ్రెటీలకి తలనొప్పిగా మారింది. తాజాగా ఇలాంటి ఫేక్ న్యూస్ కారణంగా పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
చదవండి: విజయవాడ: బాలిక ఆత్మహత్యకి కారణమైన వినోద్ జైన్ ఎవరు?
పోర్న్ స్టార్ మియా ఖలీఫా మృతి చెందినట్లు ఇటీవలే కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు సృష్టించాయి. ఈ వార్త నిజం అనుకుని మియా ఖలీఫా అభిమానులు బాగా ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో.. మియా ఖలీఫా మరణవార్త ట్రెండింగ్ గా మారింది. కానీ.., ఇదంతా ఫేక్ న్యూస్. దీంతో.. నేను బతికే ఉన్నానురా బాబు అంటూ.. స్వయంగా మియా ఖలీఫానే ఓ పోస్ట్ చేయాల్సి వచ్చింది.
ఓ హస్య భరిత మీమ్ ను పోస్టు చేస్తూ.. దాని ద్వారా తానింకా బతికే ఉన్నట్లు స్పష్టం చేసింది మియా. ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. దీంతో పోర్న్ స్టార్ మియా ఖలీఫా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
pic.twitter.com/unzTAL4xEi
— Mia K. (@miakhalifa) January 30, 2022