ఫేస్ బుక్ ప్రేమలు, ఇన్ స్టాగ్రాం పరిచయాలు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇదే విధంగా ఓ యువతి న్యూడ్ వీడియో కాల్ చేసి చిక్కుల్లో పడింది.
మహిళలు, యువతులు ఏదో ఓ చోట వంచనకు గురవుతూనే ఉన్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మహిళలను వేధించే అరాచకాలు ఎక్కువైపోయాయి. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం ద్వారా పరిచయం చేసుకుని మాయమాటలతో లోబర్చుకుని అమాయకపు మహిళల జీవితాలను ఆగం చేస్తున్నారు. ఇదే విషయంలో ఓ యువతి ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడితో చనువు పెంచుకుని అతడి మాయమాటలు నమ్మి న్యూడ్ వీడియో కాల్ చేసింది. ఇదే అదనుగా భావించిన ఆ మోసకారి ఫ్రెండ్ ఆ వీడియో కాల్ ను రికార్డ్ చేశాడు. ఆ తర్వాత అరాచకం సృష్టించాడు. ఆ వివరాలు మీకోసం..
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం అంతా దగ్గరైపోయింది. మనుషుల మధ్య దూరం తగ్గింది. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం ద్వారా పరిచయమై మొదటగా స్నేహితులుగా మారుతున్నారు. ఆ తర్వాత చాటింగ్, ఫోన్ కాల్స్ తో ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుని ప్రేమలో పడిపోతున్నారు. ఆ విధమైన ప్రేమలు కొన్ని తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. ఓ యువతి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో చనువు పెంచుకుని అతనితో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడి చిక్కుల్లో పడింది. చివరికి తన పెళ్లి కూడా రద్దైంది. ఆ తరువాత ఆ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువతికి న్యూటన్ బాబు అనే వ్యక్తికి ఫేస్ బుక్ లో పరిచయమయ్యడు. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఆ చనువుతో ఆ యువతిని న్యూడ్ వీడియో కాల్ చేయమని కోరాడు న్యూటన్ బాబు. అతడిని నమ్మిన ఆ యువతి న్యూడ్ వీడియో కాల్ చేసింది. ఇదే అదనుగా భావించిన అతడు ఆ న్యూడ్ కాల్ ను రికార్డ్ చేశాడు. దానిని అడ్డం పెట్టుకుని ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేయసాగాడు. ఈ క్రమంలో ఆ యువతికి ఏళూరుకు చెందిన పరంజ్యోతితో వివాహం నిశ్చయమైంది. ఇది తెలిసిన న్యూటన్ బాబు వరుడికి ఆ న్యూడ్ వీడియో కాల్ ను షేర్ చేసాడు. దీంతో ఆ పెళ్లి రద్దైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు న్యూటన్ బాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.