ఫేస్ బుక్ అంటే ఎవరికి తెలియదు చెప్పండి. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి యూజర్ ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని వాడుతున్నారు. అయితే మీరు ఫేస్ బుక్ లో షేర్ చేసుకునే సమాచారం సేఫ్ అని నమ్ముతున్నారా? ఈ డీటెయిల్స్ ఎవరికైనా లీక్ అయితే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా?
మీరు ఫేస్ బుక్ వాడుతున్నారా? నిజానికి స్మార్ట్ ఫోన్ యూజర్లను ఈ ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సాధారణంగా స్మార్ట్ ఫోన్ యూజర్లు ఫేస్ బుక్ వాడుతూనే ఉంటారు. మీ వ్యక్తిగత సమాచారం, డైలీ యాక్టివిటీస్, మీ ఆసక్తులు, మీ హాబీస్, మీ ఫ్రెండ్స్, రిలేషన్స్ ఇలా ప్రతి ఒక్కటి ఫేస్ బుక్ లో షేర్ చేస్తుంటారు. నిజానికి ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసే సమయంలోనే ఈ ప్రశ్నలు అన్నీ అడుగుతుంటారు. అయితే వారి వద్ద నున్న మన సమాచారం ఎంత వరకు సేఫ్? దానిని వాళ్లు తప్పుగా ఉపయోగిస్తే? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి. అలా ఒకసారి ఫేస్ బుక్ చేసిన తప్పుకి ఇప్పుడు వేల కోట్లలో యూజర్లకు పరిహారంగా చెల్లిస్తోంది.
నిజానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మీ వ్యక్తిగత సమాచారాన్ని తప్పుడు మార్గాల్లో ఉపయోగించేందుకు ఆస్కారం ఉంది. మీరు గుడ్డిగా వివరాలు మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. మీ అకౌంట్ లో తెలియజేస్తూ ఉంటారు. ఆ డేటా మొత్తాన్ని సామాజిక మాధ్యమాలు వారి ఇష్టానికి వాడుకోవచ్చు. అలా ఒకసారి ఫేస్ బుక్ చేసిన తప్పుకి ఇప్పుడు అక్షరాలా రూ.5,955 కోట్ల రూపాయలు యూజర్లకు చెల్లించబోతోంది. కోర్టు తీర్పు ప్రకారం పరిహారం చెల్లించేందుకే మెటా సంస్థ అంగీకరించింది. ఎవరికైతే ఫేస్ బుక్ అకౌంట్ ఉంటుందో వారికి ఆ మొత్తాన్ని భాగాలుగా చేసి అందించనున్నారు.
విషయం ఏంటంటే.. ఫేస్ బుక్ సంస్థపై 2018లో ఒక అలిగేషన్ వచ్చింది. అదేంటంటే ఫేస్ బుక్ కి సంబంధించన యాప్ డెవలపర్ కేంబ్రిడ్జ్ అనలటికా అనే సంస్థకు 87 మిలియన్ యూజర్ల సమాచారాన్ని అందించాడు. ఆ సంస్థ డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యేందుకు సహకరించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బ్యానన్ తో కలిసి పనిచేసే సంస్థ అది. ట్రంప్ ని అమెరికా ప్రెసిడెంట్ చేసేందుకు ఈ సమాచారాన్ని వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో పరిహారం చెల్లించేందుకు మెటా సంస్థ సిద్ధమైంది. 2007 మే24 తర్వాత అమెరికాలో ఉండి ఫెస్ బుక్ అకౌంట్ కలిగిన వారికి ఈ పరిహారాన్ని చెల్లించనున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. లేదంటే.. ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి ఫేస్ బుక్ సంస్థ పోస్ట్ చేయాలి. ఎంత మంది అయితే అప్లై చేసుకుంటారో వారికి ఈ మొత్తాన్ని పంచుతారు.