ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘణ విజయం సాధించింది. మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా ‘మా’ ఎన్నికలు ముగిశాయో లేదో, అలా ‘మా’ అసోసియేషన్ లో రాజీనామా పర్వం మొదలైంది. ఆదివారం రాత్రి ‘మా’ ఎన్నికల ఫలితాలు రాగానే నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ప్రకాష్ రాజ్, శివాజీ రాజా వంటి వారు సైతం రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
ఇక ‘మా’ ఎన్నికల తరువాత కొత్తగా ఎన్నికైన మంచు విష్ణు మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ఏమన్నారంటే.. ‘‘చిరంజీవి నన్ను పోటీ నుండి విత్‌డ్రా చేసుకోమన్నారు.. ఏకగ్రీవం చేసేందుకు ఆయన నన్ను పోటీ నుండి తప్పుకోమన్నారు.. ఈ విషయం చెప్పకూడదునుకున్నా.. కానీ ఎన్నికలు అయిపోవడం వల్ల చెబుతున్నానని విష్ణు అన్నారు.
రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు.. కానీ రామ్ చరణ్ ఓటు ప్రకాశ్ రాజ్ కే వెళ్ళింది.. నేను నాన్ తెలుగు ఫ్యాక్టర్ ను నమ్మను.. నాగబాబు తన రాజీనామాను ఉపసంహరించుకోవాలి.. ఆయన రాజీనామాను ఆమోదించను.. గెలుపోటములు సహజం.. మా నాన్న వల్లే నేను అధ్యక్షుడిగా గెలిచా.. నాన్న మీద నమ్మకంతోనే నాకు ఓటేశారు.. ఓటు వేసినవారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తా.. శివాజీ గణేషన్ కుమారుడు ప్రభు కూడా ‘మా’ సభ్యుడే.. వ్యక్తిగత కారణాల వల్ల ఎన్టీఆర్ ఓటు వేయలేదని మంచు విష్ణు చెప్పారు.
శివాజీరాజా రాజీనామా చేస్తే ఇంటికెళ్లి కొరుకుతా.. ‘మా’ సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేస్తాం..’’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఐతే చిరంజీవి తనను అధ్యక్ష్య పోటీ నుంచి తప్పుకోమన్నారన్న మంచు విష్ణు వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రలో కలకలం రేపుతున్నాయి. మరి దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.