లుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడిన ఘటనలు ఇటీవల కాలంలో చూశాం. ఈ ఘటనల్లో అధికంగా కార్మికులు బలౌతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడిన ఘటనలు ఇటీవల కాలంలో చూశాం. ఈ ఘటనల్లో అధికంగా కార్మికులు బలౌతున్నారు. భద్రతా చర్యల లోపమా లేక ఇతర కారణాలో తెలియడం లేదు. ఊహించని విధంగా మృత్యువు కబళిస్తుంది. అప్పటికప్పుడు మనతో సరదాగా గడిపిన సహోద్యోగులు కాసేపటికి నిర్జీవంగా కనిపిస్తూ కంటతడిపెట్టిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లాలోని ఓ పరిశ్రమలో సొరంగం కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు.
నంద్యాల జిల్లాలోని పాణ్యం సోలార్ పరిశ్రమలో ఘోరం జరిగింది. పరిశ్రమలోని టన్నెల్ కూలిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఒక్కసారిగా మట్టి పెళ్లలు విరిగి పడటంతో కార్మికులు పరుగులు తీశారు. అయితే ఈ పెళ్లలు పడి ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన అధికారులపై కార్మికులు మండిపడ్డారు. అధికారులు వాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా.. ఫ్యాక్టరీలో కూడా అలజడి సృష్టించారు. పని ప్రదేశంలో భద్రత కల్పించాలని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఘటనకు కారకులైనవారిని శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. అయితే వర్షం కారణంగా లేక ఇతర కారణాలతో ఈ పెళ్లలు విరిగిపడ్డాయో తెలియాల్సి ఉంది.