ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల కారణంగా పంట నష్టంతో ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఆహార కొరత ఆందోళన కలిగిస్తోందంటూ తాజాగా అధినేత కిమ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కిందటి ఏడాది తుఫానుల వల్ల చెలరేగిన వరదల కారణంగా వ్యవసాయ రంగం తగినంత ధాన్యం ఉత్పత్తి చేయలేకపోయిందని కిమ్ అన్నారు. ఉత్తర కొరియా దాదాపు 8 లక్షల 60 వేల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం అంచనా వేసింది. ఇది ఆ దేశానికి రెండు నెలలపాటు సరిపోయే అహార పదార్థాలతో సమానం.
ఈ ఏడాది ఉత్తర కొరియా 13 లక్షల టన్నుల ఆహార కొరత ఎదుర్కొంటోందని దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థ అంచనా వేసింది. కిమ్ సామ్రాజ్యంలో తాజా ధరలు – ఒక బ్లాక్ టీ ప్యాకెట్ ధర రూ.5 వేలు, కాఫీ ప్యాకెట్ ధర రూ.7 వేలు, కిలో అరటిపండ్ల ధర 3వేలకు పైనే. ఉత్తర కొరియా దాదాపు 8 లక్షల 60 వేల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం అంచనా వేసింది. ఇది ఆ దేశానికి రెండు నెలలపాటు సరిపోయే అహార పదార్థాలతో సమానం.
ఇలాంటి నివేదికల నేపథ్యంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన ‘కిమ్’ దేశంలో ఆహార సరఫరా ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. వెంటనే ఆహారోత్పత్తి గణనీయంగా పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించడం పరిస్థితికి అద్దం పడుతోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశ సరిహద్దులు మూసివేయడంతో, దిగుమతులు కూడా లేక ఆ దేశంలో తీవ్ర సంక్షోభం నెలకొంది.