గత కొన్ని రోజులుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాతావరణం కాస్త తేడగా మారింది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలు భారీ సక్సెస్ సాధించడంతో.. బాలీవుడ్‌లో కక్కలేక మింగలేక అన్న పరిస్థితి నెలకొంది. అప్పటికి కొందరు బాలీవుడ్ స్టార్లు తమ అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలో హిందీ వివాదం తెర మీదకు వచ్చింది. ఇది సమసిపోయింది అనుకునేలోపే సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని […]
మనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ ,ఎలా ఇంట్లో అమర్చుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియక పొరపాటు చేస్తుంటారు. శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే జీవితంలో పురోగమన మార్గాల్లో పయనించే అవకాశాలు కలుగుతాయని శాస్త్రం సూచిస్తుంది. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశ -కుబేర స్థానంను చూడటం మంచిది. దీనివలన ధనాదాయం లభిస్తుంది. పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి […]
ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల కారణంగా పంట నష్టంతో ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఆహార కొరత ఆందోళన కలిగిస్తోందంటూ తాజాగా అధినేత కిమ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కిందటి ఏడాది తుఫానుల వల్ల చెలరేగిన వరదల కారణంగా వ్యవసాయ రంగం తగినంత ధాన్యం ఉత్పత్తి చేయలేకపోయిందని కిమ్ అన్నారు. ఉత్తర కొరియా దాదాపు 8 […]
ప్లాస్టిక్ కవర్లు.. డబ్బాలు.. బాటిళ్లు.. పొద్దున లేచిన దగ్గర్నుంచీ వాడే పాలప్యాకెట్ నుంచి సమస్తం ప్లాస్టిక్‌మయం. ఆ ప్లాస్టిక్ చెత్తంతా ఇలా నాలాల్లోకి చేరుతోంది. ఉందన్న విషయమే తెలియనంతగా ప్లాస్టిక్ చెత్త కప్పేసింది. ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలనే ప్రసంగాలు వినపడతాయి. కానీ.. తేదీ మారగానే ప్లాస్టిక్ సంగతీ అందరూ మర్చిపోతున్న పరిస్థితి. అలా కాకుండా ఇకనుంచైనా ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని భావితరాల వారికి […]