మనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ ,ఎలా ఇంట్లో అమర్చుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియక పొరపాటు చేస్తుంటారు. శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే జీవితంలో పురోగమన మార్గాల్లో పయనించే అవకాశాలు కలుగుతాయని శాస్త్రం సూచిస్తుంది. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశ -కుబేర స్థానంను చూడటం మంచిది. దీనివలన ధనాదాయం లభిస్తుంది. పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయండి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు. ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదు.
ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు తూర్పు అభిముఖంగా నిల్చుని వంట చేయాలిఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం. ఈశాన్యం దర్వాజా తప్ప ఏ వైపు డోర్ వేనుకవైపు గోడకు ఒక మేకు కొట్టి చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా మాత్రమే పెట్టి ఉండాలి. రివర్స్ పెడితే ఇంట్లో శని దేవుని నిలుపుకున్నట్లే అవుతుంది. చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనబడకుండా ఉండాలి, కాబట్టి డోర్ వెనక భాగంలో పెట్టుకొమ్మని సలహా ఇవ్వడం జరుగుతుంది.