గత కొన్ని రోజులుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాతావరణం కాస్త తేడగా మారింది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలు భారీ సక్సెస్ సాధించడంతో.. బాలీవుడ్‌లో కక్కలేక మింగలేక అన్న పరిస్థితి నెలకొంది. అప్పటికి కొందరు బాలీవుడ్ స్టార్లు తమ అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలో హిందీ వివాదం తెర మీదకు వచ్చింది. ఇది సమసిపోయింది అనుకునేలోపే సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. బాలీవుడ్ నన్ను భరించేలేదు అంటూ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. దీనిపై ఆయన టీం క్లారిటీ ఇచ్చినప్పటికి నెటజనులు మాత్రం ఊరుకోవడం లేదు. ముఖ్యంగా ఉత్తరాది వారు.. మహేష్ బాబును ట్రోల్ చేసే అవకాశం కోసం తెగ వెతుకుతున్నారు.
I assume only TFI stars like #MaheshBabu are allowed to sell Pan Masala products, while the rest are abused for doing the same. Nice double standards😒 @Its_CineHub
#SarkaruVaariPaata #SVP #PrithvirajChauhan pic.twitter.com/ymuv2Vw1oi— J.P.S (@TheJ_P_S) May 12, 2022
ఇండస్ట్రీ జనాలు ఊరుకున్నా.. నెటిజనులు మాత్రం మహేష్ బాబు వ్యాఖ్యలన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మరీ ముఖ్యంగా నార్త్ నెటిజన్స్ మహేష్ బాబుపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో మహేష్‌ను ట్రోల్ చేసేందుకు వారికి పాన్ బహర్ యాడ్ రూపంలో అవకాశం లభించింది. దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. మహేష్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘‘పాన్ మసలా కంపెనీ మహేష్‌ను భరించగలదు కానీ.. బాలీవుడ్ కాదు’’.. ‘‘బాలీవుడ్ తనను భరించలేదంటూ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఎంత ఫన్నీగా ఉన్నాయి. ఆయన తన బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి పాన్ బహర్ యాడ్ చేశాడు. ఓ పాన్ మసలా కంపెనీ ఆయనను భరించగలదు కానీ.. బాలీవుడ్ భరించలేదా.. ఈ సారి నుంచి సరైన వాదన వినిపించండి’’.. ‘‘యస్.. పాన్ మసలా యాడ్ మాత్రమే నన్ను భరించగలదు’’.. ‘‘బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ వంటి స్టార్లు ఈ పాన్ మసలా యాడ్స్‌లో నటించినందుకు వారిని విమర్శించారు. అదే పని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మహేష్ బాబు చేస్తే మాత్రం ఏమనడం లేదు. రెండు నాల్కల ధోరణికి ఇదే బెస్ట్ ఎగ్జామ్‌పుల్’’ అంటూ నార్త్ ఆడియోన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Super Star Krishna: ‘సర్కారు వారి పాట’ సినిమా బాగాలేదు.. అన్నవాళ్ళకు సూపర్ స్టార్ కృష్ణ కౌంటర్!
Just saw many trolling and abusing Bollywood starts on their endorsement of Vimal Pan Masala but if I am not mistaken many of the starts in South India too have endorsed such Pan Masalas just that they never faced such criticism.
Mahesh Babu is no difference.
Tiger Shroff too. pic.twitter.com/vS1sDZ0xzB— Aman Gupta (@imamangupta07) May 11, 2022
It’s funny how #MaheshBabu said that #Bollywood can’t afford him. But a pan masala brand can ( he endorses Pan Bahar and having a Bollywood equivalent in Tiger shroff). Nothing wrong with it. But next time onwards, bring a better arguement to act that Elite. pic.twitter.com/JkDGDBmpUC
— Shikhar Sinha (@pairgame) May 15, 2022
ఇది కూడా చదవండి: Mahesh Babu: వెండితెర ‘శ్రీమంతుడు’.. సినిమాలతో తిరిగి ఇచ్చేస్తున్నాడు..