కర్ణాటకలో విచిత్రకరమైన ఘటన చోటు చేసుకుంది. తన భర్త ప్రొపైల్ ను గే డేటింగ్ యాప్ లో చూసిన భార్య షాక్ అయింది. పెళ్లయిన మూడేళ్ల నుంచి తనతో ఎందుకు కలవడం లేదో తెలుసుకుని ఒక్కసారికి నివ్వెరపోయింది. తన గొంతు కోసి పెళ్లి చేశారని ఆరోపిస్తూ బాధితురాలు భర్త కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. స్వలింగ సంపర్కుడనే విషయాన్ని దాచి భర్త తనను పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్తపై మోసం కింద కేసు పెట్టారు.
భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. 2018 లో ఇద్దరికీ వివాహం అయింది. ఇద్దరూ చూడ ముచ్చటగా ఉన్నారు. భర్త మంచి సంపాదన పరుడు కావటంతో భార్య సంతోష పడుతుందని యువతి తల్లితండ్రులు ఆశించారు. కానీ, అసలు విషయం ఎవరికీ తెలియలేదు. కర్ణాటకలోని బవసణ్నగుడి పరిధిలో చోటు చేసుకున్న ఘటన ఇది. భార్య ఎంత ప్రయత్నించినా భర్త లో ఆ స్పందనే లేదు. రోజు ఏదో ఒక కారణం చెప్పి ఆమెతో పడక గదిలో గడపడం లేదు. కానీ, ఫోన్ లో మాత్రం పిచ్చ బిజీగా ఉంటాడు.
వరకట్నం అడిగినంత ఇస్తేనే కలుస్తానని చెప్పాడు. అడిగినంత డబ్బు ఇస్తున్నా కలయికకు అయిష్టంగా ఉండటంతో చొరవ చూపించి తాను దగ్గరౌదామని ప్రయత్నించినా ఏదో ఒక కారణం చెప్పి దూరం పెట్టేవాడు. అసలు విషయం ఫోన్ తో బయట పడింది.అతడు పురుషులతో లైంగికపరమైన విషయాలు చాటింగ్ చేస్తున్నాడు. దీంతోపాటు గే యాప్‌లలో ఆయన ప్రొఫైల్ ఉంది. ఇది చూసి ఆమె షాక్‌కు గురయ్యింది. వెంటనే అతడిని నిలదీయగా అసలు మేటర్ లేదని బాంబు పేల్చాడు.
తాను స్వలింప సంపర్కుడినని గే డేటింగ్ యాప్‌లలో ప్రొఫైల్ ఉందని తాను గే అని అంగీకరించాడు. దీంతో ఆమె అతడితో విడిపోవాలని నిశ్చయించుకుంది. ప్రస్తుతం వీరి దాంపత్య జీవనం కోర్టు మెట్లు ఎక్కింది. విడాకులు కావాలని భార్య న్యాయస్థానంలో పోరాడుతోంది. తనకు పురుషులపైనే లైంగికపరమైన ఆసక్తి ఉందని, కేవలం సమాజంలో గౌరవం కోసమే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడని మహిళ వాపోయింది.
అతడి మొదటి భార్య కూడా ఇదే కారణంతో అతడిని వదిలేసి ఉంటుందని అనుమానించి వారిని ఆరా తీసారు. ఆతను భార్యతో కాకుండా పురుషులతో సన్నిహితంగా మెలగటం చూసి తాము వదిలించకున్నామని మొదటి భార్య తరపు బంధువుల చెప్పారు. సాఫ్ట్ వేర్ యువతి రగలిపోయింది. విషయం ముందే తెలిసీ తనకు అతడితో పెళ్లి చేశారని బాధితురాలు భర్త కుటుంబసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
భర్త వ్యవహారంతో పోలీసు స్టేషన్ లో పంచాయితీ పెట్టి నిజం నిగ్గు తేల్చింది. దీంతో పోలీసుల సూచనతో న్యాయ పోరాటానికి దిగింది.