ప్రముఖ క్రిటిక్, సినీ జర్నలిస్ట్ బిగ్ బాస్ షో పార్టిసిపెంట్ కత్తి మహేశ్ యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కత్తి మహేశ్ చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కత్తి కుడి కంటికి ఓ ఆపరేషన్ కూడా జరిగింది. కానీ.., ఇంకో నెల రోజుల పాటు.., కత్తి మహేశ్ ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు ఇప్పటికే తెలియచేశారు. అయితే.., కత్తి మహేశ్ చికిత్స ఖర్చుల కోసం జగన్ సర్కార్ ఇప్పుడు రూ.17 లక్షల భారీ ఆర్థిక సాయం చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నగదు అందించారు. ఇందుకు సంబంధించిన లేఖను సైతం సీఎం క్యాంపు ఆఫీస్ విడుదల చేసింది.
నిజానికి కత్తి మహేశ్ హాస్పిటల్ లో జాయిన్ అయిన మరు క్షణం నుండి అతని ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చుపై భారీగానే చర్చ నడిచింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి కుటుంబానికి సహాయం చేశారని వార్తలు వచ్చాయి. కానీ.., కత్తి మహేశ్ సన్నిహితులు ఈ వార్తలని ఖండించారు. కత్తి హాస్పిటల్ ఖర్చులన్నీ తామే భరిస్తున్నామని, ప్రస్తుతం అపోలో హాస్పిటల్ యాజమాన్యం అతని ఇన్స్యూరెన్స్ పాలసీలు క్లైమ్ చేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలియచేశారు.
కత్తి మహేశ్ ఇంకో నెల రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలి. ఇక డిశ్చార్జ్ అయిన తరువాత కూడా 90 రోజుల పాటు అతను అండర్ ట్రీట్మెంట్ లో ఉన్నట్టే లెక్క. ఆ తరువాత కత్తి మహేశ్ కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చని డాక్టర్స్ తెలియచేస్తున్నారు. ఈ కారణంగానే కత్తికి ఇంత ఆర్ధిక సహాయం అందినట్టు తెలుస్తోంది. అయితే.., కత్తి మహేశ్ కి ఇంత భారీ ఆర్ధిక సహాయం అందటంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.