ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త జట్లలో ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటికే 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో లక్నో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఈ జట్టుకు ప్రధాన బలం బౌలింగ్. ఆవేశ్ ఖాన్, జెసన్ హోల్డర్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్‌కి తోడు మరో కొత్త వజ్రాయుధం వచ్చి చేరింది. అతని పేరే మొహ్‌సిన్ ఖాన్. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యంగ్ బౌలర్ చెలరేగిపోయాడు. నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన మొహ్‌సిన్ కేవలం 16 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఢిల్లీ కెప్టెన్ పంత్‌ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఢిల్లీ వైపు ఉన్న గెలుపు ముల్లును లక్నో వైపుకు తిప్పాడు.
ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన మొహ్‌సిన్ ఖాన్.. 8 వికెట్లు సాధించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ యువ పేసర్‌ను ఐపీఎల్-2022 మెగా వేలంలో లక్నో రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో 2018 నుంచి 2020 సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు మొహిసిన్ ఖాన్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక దేశీవాళీ టోర్నీలో ఉత్తర్‌ప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 17 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన అతడు 26 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 28 టీ20ల్లో 34 వికెట్లు సాధించాడు. మరి ఈ యంగ్ టాలెంటెడ్ బౌలర్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MS Dhoni: బెన్ స్టోక్స్ గురించి ఐదేళ్ల క్రితం ధోని చెప్పిందే జరిగింది!
Mohsin Khan in last 3 matches in IPL 2022:
4-0-27-1
4-1-24-3
4-0-16-4 pic.twitter.com/VvtImXDTH6— Johns. (@CricCrazyJohns) May 1, 2022
4 overs, 4 wickets, and countless Lucknow fans screaming his name: @mohsin07khan is today’s well-deserved player of the match!#AbApniBaariHai💪#IPL2022 🏆 #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL pic.twitter.com/swGLmAJNfM
— Lucknow Super Giants (@LucknowIPL) May 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.