SRH vs LSG Prediction: సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమిని మర్చిపోయేలా.. లక్నోపై విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రెగ్యులర్ కెప్టెన్ మార్కరమ్‌తో పాటు జాన్సెన్ కూడా జట్టులో చేరడంతో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సన్‌రైజర్స్.. లక్నోపై గెలుస్తుందా?
ఐపీఎల్ 2023లో మ్యాచ్‌లన్నీ రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇది లక్నోకు మూడో మ్యాచ్ కాగా.. ఎస్‌ఆర్‌హెచ్‌కు రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో లక్నోపై విజయం సాధించిన లక్నో.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మరోవైపు.. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో లక్నోతో జరిగే రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. మరి ఇరుజట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్..
చాలా సీజన్ల కంటే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే తొలి మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ మార్కరమ్, ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ లేకపోవడం జట్టుపై కాస్త ప్రభావం ఊపింది. అలాగే భువనేశ్వర్ కుమార్ సైతం కెప్టెన్‌గా ఆకట్టుకోలేకపోయాడు. అందుకే తొలి మ్యాచ్‌లో ఆశించిన ఫలితం రాలేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కానీ, రెండో మ్యాచ్‌లో మార్కరమ్, జాన్సెన్ జట్టులో చేరడంతో జట్టు బలపడింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఉన్నారు. వన్‌డౌన్‌లో రాహుల్ త్రిపాఠి, మిడిల్డార్‌లో మార్కరమ్, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్‌తో బ్యాటిండ్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉంది. చివర్లో మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్ ఉండనే ఉన్నారు. అలాగే బౌలింగ్‌లో భువీ, సుందర్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఉండటంతో బౌలింగ్ విభాగం సైతం పటిష్టంగా మారింది. అయితే.. బౌలింగ్‌లో భారీగా పరుగులు ఇవ్వడం కాస్త ఆందోళన కలిగించే అంశం.
లక్నో సూపర్ జెయింట్స్..
తొలి మ్యాచ్‌లో విజయం సాధించి మంచి జోష్‌లో కనిపించిన లక్నో.. రెండో మ్యాచ్‌లో ఓటమి పాలై తేలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సన్‌రైజర్స్‌తో మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నోలోనూ ఒక సౌతాఫ్రికా క్రికెటర్ వచ్చి చేరాడు. ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ రావడంతో టీమ్ బలపడింది. అయితే.. ఇప్పటికే కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో ఓపెనింగ్ చేస్తున్న కైల్ మేయర్స్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మరి అతని స్థానంలో డికాక్‌ను ఆడిస్తారా? లేక మేయర్స్‌నే కొనసాగిస్తారా? అనేది చూడాలి. ఇక బౌలింగ్‌లో లక్నో కాస్త వీక్‌గానే ఉందని చెప్పాలి. మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ ఇద్దరు రాణిస్తున్నా.. మిగతా వాళ్లు ప్రభావం చూపలేకపోవడం లక్నోకు ఇబ్బందిగా మారింది.
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)
SRH: అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జానెన్స్, వాషింగ్టన్ సుందర్, భువీ, ఉమ్రాన్, నటరాజన్
LSG: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, ఆయూష్ బదోని, రవి బిష్ణోయ్, మార్క్ వుడ్, ఉనద్కట్, ఆవేశ్ ఖాన్
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశం ఉంది.
Match no :10 SRH vs LSG April 7th Friday Watch only on #IPLonstar @starsportsindia #orangefireidhi #SRH #Ipl2023 #Sunrisers #hyderabad #Hyd pic.twitter.com/mV6BCdJZE5
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) April 7, 2023