ఆటగాళ్లలో ఉన్న అసలైన ప్రతిభ ఏంటో తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడే బయటపడుతుందని క్రీడా నిపుణులు అంటుంటారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో పేసర్ మోసిన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చూశాక ఇది నిజమేనని అనిపిస్తుంది.
ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టింది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో 5 రన్స్ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ చేయడం కష్టతరంగా మారిన పిచ్‌పై స్టొయినిస్ (89 నాటౌట్)తో పాటు కృనాల్ పాండ్య (49 రిటైర్డ్ హర్ట్) పోరాటంతో 3 వికెట్లకు 177 రన్స్ చేసింది లక్నో. ఆ తర్వాత ముంబైని 172 రన్స్‌కే కట్టడి చేసి గెలుపుతో పాటు కీలకమైన రెండు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఎల్ఎస్జీ బౌలర్లలో రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్ చెరో రెండు వికెట్లతో చెలరేగారు. లాస్ట్ ఓవర్లో ముంబైని కట్టడి చేసి లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించాడు మోసిన్ ఖాన్. అతడు వేసిన చివరి ఓవర్ ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా చెప్పొచ్చు. ముంబై గెలుపునకు లాస్ట్ ఓవర్లో 11 రన్స్ కావాలి. జోరు మీదున్న డేవిడ్‌తో పాటు కామెరూన్ గ్రీన్ క్రీజులో ఉండటంతో ముంబై గెలుస్తుందనిపించింది.
తీవ్ర ఒత్తిడిలో, చావోరేవో తరుణంలో మోసిన్ ఖాన్ గొప్పగా బౌలింగ్ చేశాడు. 1, 4 బాల్స్‌కు రన్ ఇవ్వని అతడు.. 2, 3, 5 బాల్స్‌కు కేవలం సింగిల్సే ఇచ్చాడు. దీంతో చివరి బాల్ పడటానికి ముందే ముంబై గెలుపు దారులు మూసుకుపోయాయి. ఈ మ్యాచ్‌లో లక్నో గెలుపులో స్టొయినిస్, కృనాల్ పాండ్యతో పాటు ఆ జట్టు బౌలర్ల కృషి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది మాత్రం మోసిన్ ఖాన్నే. అంత ఒత్తిడిలో మేటి బ్యాటర్లు క్రీజులో ఉన్నప్పుడు అతడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం సూపర్బ్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో ముంబైని పోయించిన మోసిన్ జీవితం గతేడాది చాలా కష్టంగా గడిచింది. దాదాపు 10 నెలల పాటు అతడు క్రికెట్‌కు దూరమయ్యాడు. సర్జరీలు, ఫిట్నెస్ సమస్యలతో ఐపీఎల్-16 తొలి అంచెకు కూడా దూరమయ్యాడు మోసిన్ ఖాన్. అయితే వచ్చీరాగానే లాస్ట్ ఓవర్లో 11 రన్స్ డిఫెండ్ చేసి శభాష్ అనిపించుకున్నాడు.
ముంబైతో మ్యాచ్ అనంతరం మాట్లాడిన మోసిన్.. తాను అనుభవించిన బాధను అందరితో పంచుకున్నాడు. తన నాన్న గత పది రోజులుగా ఐసీయూలో ట్రీట్మెంట్ పొందారని తెలిపాడు. సోమవారమే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ఆయన కోసమే ఈ మ్యాచ్‌లో నెగ్గాలని అనుకున్నానని చెబుతూ మోసిన్ ఎమోషనల్ అయ్యాడు. ఇంజ్యురీలతో తన కెరీర్ ప్రమాదంలో పడిందని, ఒక సమయంలో క్రికెట్ ఆడలేనేమోనని అనుకున్నానని పేర్కొన్నాడు. సర్జరీ మరో నెల రోజులు ఆలస్యమైతే.. తన చేతిని తీసేయాల్సి వచ్చేదని వైద్యులు అన్నారని మోసిన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కష్ట సమయంలో లక్నో టీమ్ తనకు మద్దతుగా నిలిచిందన్నాడు. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మోసిన్‌ను ఐపీఎల్-2022 మెగా వేలంలో లక్నో జట్టు రూ.20 లక్షలకు కొనుక్కుంది. గతంలో 2018 నుంచి 2020 వరకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు మోసిన్.
Mohsin Khan’s Masterclass in last over 🥵 pic.twitter.com/CU6XolZyCK
— Mohammed (@Klassy_KLR) May 17, 2023
Another comeback story this season🌟 pic.twitter.com/szNc108nUN
— CricTracker (@Cricketracker) May 16, 2023
Mohsin Khan dedicates his performance to his father.#IPL2023 pic.twitter.com/ynRsJ3OcfY
— CricTracker (@Cricketracker) May 16, 2023