ముంబయిని ముప్పతిప్పలు పెట్టి, చివరి ఓవర్ లో చుక్కలు చూపించిన మోసిన్.. ఎంతో బాధని దిగమింగుకుని మరీ ఈ మ్యాచ్ ఆడాడు. అతడి స్టోరీ తెలిస్తే మీరు కచ్చితంగా ఎమోషనల్ అవుతారు.
ముంబయి ఇండియన్స్.. ప్రతి ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ లో ఓడిపోతుంది. చివర్లో వరసపెట్టి విజయాలు సాధిస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి సీజన్ లోనూ ఈ ఫార్ములానే ఫాలో అవుతూ వచ్చింది. అందుకు తగ్గట్లే వీళ్లకు పరిస్థితులు అనుకూలిస్తూ వచ్చాయి. ఈసారి మాత్రం అలా జరగలేదనే చెప్పాలి. తాజాగా లక్నో మ్యాచ్ లోనూ ఛేజింగ్ చేసి గెలిచేయాలని చూసింది. కానీ మోసిన్ ఖాన్ అనే ఓ బౌలర్.. ముంబయి గెలుపుకు స్పీడ్ బ్రేకర్ లా మారాడు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కి కారణమయ్యాడు. కానీ ఈ బౌలర్ స్టోరీ వింటే మీరు కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు.
అసలు విషయానికొచ్చేస్తే.. ఈసారి ఐపీఎల్ చాలా అంటే చాలా రసవత్తరంగా మారిపోయింది. లీగ్ దశ చివరికొచ్చేసినా సరే ప్లే ఆఫ్స్ కి ఎవరెవరు వెళ్లింది తేలలేదు. ఎందుకంటే మ్యాచ్ లు అలా జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే గుజరాత్ మాత్రమే ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది. టాప్-4లో మిగతా మూడు స్థానాల కోసం దాదాపు 7 టీమ్స్ కొట్టుకుంటున్నాయి. తాజాగా ముంబయికి చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాచ్ లో లక్నో విజయం సాధించేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. 177/3 స్కోరు చేసింది. ఛేదనలో ముంబయి 172/5 పరుగులకే పరిమితమైంది.
గత కొన్ని మ్యాచుల నుంచి ఛేజింగ్ చేస్తూ కింగ్ అనిపించుకుంటున్న ముంబయి.. లక్నోతో మ్యాచ్ తేలిపోయింది. చెప్పాలంటే చివరి ఓవర్ లో 11 రన్స్ కావాలి. మోసిన్ బౌలింగ్ చేస్తున్నాడు. పెద్ద పేరున్న బౌలర్ కాదు. క్రీజులో గ్రీన్, టిమ్ డేవిడ్ లాంటి హిట్టర్స్ ఉన్నారు. అయినా సరే కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. లక్నోకి అదిరిపోయే విజయాన్ని అందించాడు. గతేడాది ఇదే టైమ్ కి మోసిన్ సర్జరీ జరిగింది. ఈ సీజన్ లో అంతంత మాత్రంగానే ఛాన్సులు అందుకున్న మోసిన్.. పరుగులివ్వడం తప్పితే వికెట్లు తీసింది కూడా ఏం లేదు. ఈ మ్యాచ్ లో మాత్రం మోసిన్.. తనపై కెప్టెన్ కృనాల్ పాండ్య పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు.
అయితే మోసిన్ తండ్రి గత 10 రోజుల నుంచి ఐసీయూలో సీరియస్ కండీషన్ లో ఉన్నారు సోమవారమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కోసమైనా సరే ఈ మ్యాచ్ గెలవాలనుకున్నానని మోసిన్ ఎమోషనల్ అయ్యాడు. ఈరోజు తన బౌలింగ్ చూసి ఆయన కచ్చితంగా హ్యాపీగా ఫీలయ్యుంటారని చెప్పుకొచ్చాడు. గాయంతో తన కెరీర్ ప్రమాదంలో పడిందిన చెప్పిన మోసిన్.. మళ్లీ క్రికెట్ ఆడనేమో అనే ఫీలిగ్ వచ్చిందని తెలిపాడు. సర్జరీ చేయించుకోవడం నెలరోజులు లేట్ అయ్యుంటే.. తన చేయి తీసేయాల్సి వచ్చేదని డాక్టర్స్ చెప్పినట్లు మనోడు బయటపెట్టాడు. ఈ టైంలో తనకు అండగా నిలిచిన లక్నో టీమ్ కు ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు. మరి మోసిన్ బౌలింగ్, ముంబయి ఓడిపోవడం లాంటివి చూసిన తర్వాత మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.
Mohsin Khan dedicates his performance to his father.#IPL2023 pic.twitter.com/ynRsJ3OcfY
— CricTracker (@Cricketracker) May 16, 2023