ఐపీఎల్ చివరిదశకు వచ్చేసింది. ప్లే ఆఫ్స్ సమరం షూరూ అయింది. దీంతో ఎవరికీ తగ్గ అనాలిసిస్ లో వాళ్లు చేస్తున్నారు. మేం కూడా నాలుగు జట్ల బలాలు బలహీనతల గురించి రాసుకొచ్చాం. ఆ స్పెషల్ స్టోరీనే ఇదే. మీరు కూడా ఓ లుక్కేయండి.
ఈసారి ఐపీఎల్ కప్ కొట్టేది ఎవరు? ఈ క్వశ్చన్ అడగ్గానే మీరు నాలుగు టీమ్స్ లో ఏదో ఓ పేరు చెబుతారు. కానీ గత సీజన్ ప్లే ఆఫ్స్ తో పోలిస్తే ఈసారి లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ తోపాటు కప్ కొట్టడంలో చాలా అంటే చాలా అనుభవమున్న చెన్నై, ముంబయి జట్లు టాప్-4లో ఉన్నాయి. వీళ్ల ఛాన్సులు చెడగొట్టడానికా అన్నట్లు లక్నో ఉండనే ఉంది. దీంతో ఈసారి ఐపీఎల్ విన్నర్ రేసు మంచి రంజుగా ఉండనుందే ఆల్రెడీ తెలిసిపోతుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ నాలుగు జట్ల బలాలు-బలహీనతలు ఓసారి చూద్దాం. ఆ తర్వాత మీకే కప్ గెలిచేది ఎవరో ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదే ధోనీకి చివరి సీజన్ అంటున్నారు. ధోనీ అలా ఏం కాదని చెబుతున్నాసరే ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడనేలా వైబ్స్ కనిపిస్తున్నాయి. గత సీజన్ లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచిన సీఎస్కే.. ఈసారి ఏకంగా 2వ ప్లేసులో నిలిచింది. 2020లోనూ ఇలానే లాస్ట్ లో నిలిచింది. 2021లో కప్ కొట్టేసింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఈసారి కప్ చెన్నైదే అని ఫిక్సవుతున్నారు. క్వాలిఫయర్-1లో ఓడినాసరే క్వాలిఫయర్-2 ఉంటుంది. అందులో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టి కప్ కొడతామని అంటున్నారు. అయితే చెన్నై బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ లో తడబడతోంది. కొన్ని మ్యాచ్ లో స్కోరుని బాగా కట్టడి చేసిన బౌలర్లు.. మరికొన్ని మ్యాచ్ ల్లో చేతులెత్తేశారు. లీగ్ దశ అంటే ఒకదానిలో ఓడితే మరోదానిలో గెలిచే ఛాన్సు ఉంటుంది. ప్లే ఆఫ్స్ అలా కాదు కదా. ఇవన్నీ పక్కనబెడితే ధోనీ కెప్టెన్ ఇప్పటికే నాలుగు కప్పులు గెలుచుకున్నాడు. ఆ అనుభవాన్ని బయటకు తీస్తే చెన్నై విన్నర్ కావడం పెద్ద కష్టమేం కాదు.
ముంబయి ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ప్లే ఆఫ్స్ కి వస్తుందని ఆ జట్టు కూడా అనుకుని ఉండదు. ఆర్సీబీ ఓడిపోవడంతో లక్కీగా టాప్-4లోకి వచ్చేసింది. ముంబయికి ప్లే ఆఫ్స్ లో మంచి రికార్డే ఉంది. గత కొన్నేళ్లలో రోహిత్ కెప్టెన్సీలో ఏకంగా 5 కప్పులు కొట్టింది మరి. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు పూర్తిగా వేరు. బ్యాటింగ్ పరంగా ఎంత పెద్ద టార్గెట్ అయినాసరే ఉఫ్ మని ఊదేసే బ్యాటర్లు ఉన్నారు. కానీ బౌలర్లే ఘోరంగా తయారయ్యారు. లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్ లో ఇప్పటివరకు చేసిన తప్పుల్ని కవర్ చేసుకుంటే పర్లేదు లేదంటే అస్సాం ట్రైన్ ఎక్కేస్తుంది. అందరూ ముంబయి 6వ కప్ కొడుతుందేమో అనుకుంటున్నారు కానీ మా వరకైతే ఎందుకో ఈసారి అది కష్టం అనిపిస్తోంది.
గుజరాత్ టైటాన్స్ గురించి చెప్పాలంటే నిజంగా అద్భుతాలు చేస్తోంది. గతేడాది ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చి ఏకంగా కప్ కొట్టేసింది. లాస్ట్ ఇయర్ అంటే ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ, రాజస్థాన్, లక్నో జట్టు ఉన్నాయి కాబట్టి గుజరాత్ ఆట నడిచింది. ఈసారి అలా కాదేమో అనిపిస్తుంది. చెన్నై, ముంబయి ఇప్పటికే లెక్కకు మించి కప్పులు సొంతం చేసుకున్నాయి. అలాంటి జట్లతో ప్లే ఆఫ్ మ్యాచ్ లంటే కత్తిమీద సాము. ఇది పక్కనబెడితే గుజరాత్ లో ఒకరిద్దరూ మినహా పెద్దగా స్టార్స్ లేరు. అయినా సరే టీమ్ గా ఆడుతూ గత సీజన్ లో అద్భుతాలు చేసింది. సేమ్ అదే థియరీ ఇప్పుడు కూడా అప్లై చేసి కప్ కొట్టేయాలని పెద్ద ప్లాన్ చేస్తోంది. ఇలా ఫుల్ స్ట్రాంగ్ గా ఉన్న గుజరాత్.. ఈసారి కూడా కప్ కొట్టేలా కనిపిస్తుంది.
లాస్ట్ అండ్ ఫైనల్ లక్నో సూపర్ జెయింట్స్. సేమ్ గుజరాత్ లానే గత సీజన్ లోనే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చింది. ప్లే ఆఫ్స్ కి చేరింది. కానీ కప్ కొట్టలేకపోయింది. ఈసారి మాత్రం విజేతగా నిలవాలని అనుకుంటోంది. కేవలం అనుకుంటే సరిపోదు కదా దాన్ని రియాలిటీలో చూపించాల్సి ఉంటుంది. అయితే లక్నో ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించడం చాలా కష్టం. ఒకసారి సూపర్ బౌలింగ్ చేస్తే ఆ మ్యాచ్ లో బ్యాటర్లు చేతులెత్తేస్తారు. మరో మ్యాచ్ లో బ్యాటర్లు ఆకట్టుకుంటే బౌలర్లు పరుగులు సమర్పించుకుంటారు. ఇలా అన్ ప్రిడిక్టిబుల్ గా ఉన్న లక్నోతో మిగతా మూడు టీమ్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం! ప్రస్తుత పరిస్థితులన్నీ అనలైజ్ చేసి చూస్తే.. గుజరాత్ కే మంచి ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమై ఈ టీమ్ కప్ కొడితే మాత్రం వరసగా రెండు సీజన్లలో కప్ కొట్టిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. సరే ఇదంతా పక్కనబెట్టండి. ఈసారి ఐపీఎల్ విన్నర్ ఎవరని మీరనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.