విరాట్ కోహ్లీతో వివాదంతో నవీన్ ఉల్ హక్ పేరు బాగా వైరల్ అవుతోంది. అయితే కోహ్లీనే కాదు.. సీనియర్లతో వివాదాలు పెట్టుకోవడం నవీన్ ఉల్ హక్ కి కొత్తేం కాదు. ఇప్పటికే చాలా మంది సీనియర్లతో గొడవలు పడి ఉన్నాడు. ఇంత చిన్న వయసులో టాలెంట్ తో వార్తల్లో నిలవాలి గానీ.. ఇతను మాత్రం గొడవలతో వార్తల్లో నిలుస్తున్నాడు.
నవీన్ ఉల్ హక్.. ప్రస్తుతం భారత్ లోనే కాకుండా క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమ్రోగుతోంది. ఐపీఎల్ 2023లో లక్నో జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అఫ్గానీ ప్లేయర్ విరాట్ కోహ్లీ గొడవతో వార్తల్లో నిలిచాడు. అయితే కోహ్లీతో గొడవ విషయంలో కొందరు కోహ్లీకి సపోర్ట్ చేస్తుండగా.. కొందరు మాత్రం నవీన్ ఉల్ హక్ పక్షాన మాట్లాడుతున్నారు. అతనికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఒకటిఉంది. ఎంతో టాలెంటెండ్ బౌలర్ అయిన నవీన్ ఉల్ హక్.. ఆటతో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమ్ సంపాదించుకున్నాడు. సీనియర్లతో గొడవలు పడటం అతనికి కొత్తేం కాదు. ఇదే మొదటిసారి కానేకాదు.
అఫ్గనిస్తాన్ కు చెందిన ఈ 23 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియమ్ బౌలర్ ఎంతో టాలెంటెడ్ ప్లేయర్. 2016లో తన వన్డే కెరీర్ ప్రారంభించాడు. 2021 వరకు కేవలం 7 మ్యాచ్ లు మాత్రమే ఆడగలిగాడు. 2019లో అంతర్జాతీ టీ20 కెరీర్ ప్రారంభించిన నవీన్ ఉల్ హక్.. ఎక్కువగా లీగ్ మ్యాచ్ లలో ఆడుతుంటాడు. ఇతను బిగ్ బ్యాష్ లీగ్, లంకన్ ప్రీమియర్ లీగ్ లు ఆడాడు. అయితే కోహ్లీతో గొడవకు దిగిన తర్వాత అంతా ఇతని పేరును ప్రస్తావిస్తున్నారు గానీ.. అతను బిగ్ బ్యాష్ లీగ్, లంకన్ ప్రీమియర్ లీగ్ లలో కూడా సీనియర్లతో ఇలాగే ప్రవర్తించాడు. అందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Naveen Ul Haq in
– BBL
– SLPL
– PSL
– IPLThis guy is fighting with someone in every franchise league 😭😭 pic.twitter.com/gpbXEPVjcA
— 𝙍𝘿𝙆 #LEO (@Goatcheeku_18) May 2, 2023
బీబీఎల్ 2022 సీజన్లో సిడ్నీ సిక్సర్స్, హోబార్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. నవీన్ ఉల్ హక్ సిడ్నీ సిక్సర్స్ తరఫున బౌలింగ్ చేస్తున్నాడు. షార్ట్ కు బాల్ వేయగా అతను మిడ్ వికెట్ వైపు ఫ్లిక్ చేసిన సింగిల్ కోసం వెళ్తుంటాడు. పిచ్ కి దూరంగా నవీన్ ఉల్ హక్ వస్తూ.. షార్ట్ ని అడ్డుకోబోతాడు. అది గమనించిన షార్ట్ అతడిని భుజంతో ఢీ కొడతాడు. లంకన్ ప్రీమియర్ లీగ్ లో కూడా రెండో పరుగు కోసం వెళ్లబోతున్న తిసారా పెరేరాను అడ్డుకోబోతాడు. అప్పుడు పెరేరా కూడా అగ్రహం వ్యక్తం చేస్తాడు. అలాగే ఎల్ పీఎల్ లోనే ఆమిర్- అఫ్రిదీతో కూడా నవీన్ ఉల్ హక్ ఇలాంటి ప్రవర్తనే చూపించాడు. తాజాగా విరాట్ కోహ్లీతో పెద్ద వివాదమే జరిగింది. అయితే టాలెంట్ ఉంటే సరిపోదు.. కాస్త మైదానంలో పద్ధతిగా కూడా ఉండాలంటూ నవీన్ ఉల్ హక్ కు క్రికెట్ ఫ్యాన్స్ హితవు పలుకుతున్నారు.
Naveen Ul Haq Deserves 10 Slap For This.
Dear Virat Kohli, He Deserved 1 From You As Well. pic.twitter.com/eqUoihIL7Y
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) May 2, 2023