ప్రస్తుతం కరెంట్, గ్యాస్, ఫోన్ ఇలా ఒక్కటేంటి.. ప్రతి దాని బిల్లు ఆకాశానంటుతున్నాయి. ఈ ధరలకు తట్టుకోలేక చాలా మంది అల్లాడుతున్నారు. అయినా ఆర్థిక సమస్యలు పెరిగిన సర్థుకుని జీవిస్తున్నారు. కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యానికి సామన్యులు శిక్ష అనుభవిస్తున్నారు. ఒక్కొక్కసారి వారి ఇచ్చే బిల్లు చూస్తే గుండె ఆగినంత పనవుతుంది. తాజాగా ఓ యువ జంటకు అలాంటి అనుభవం ఎదురైంది. వారికి వచ్చిన గ్యాస్ బిల్లు చూసి ఖంగుతిన్నారు. ఈ ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ లోని హార్పెన్ డెన్ లో యువ జంట శ్యాంమాట్రం, మాడీ రాబర్ట్ సన్ నివస్తున్నారు. అయితే ఈ జంట గ్యాస్ పై, విద్యుత్ వాడకంపై ఏటా 1300 యూరోలు వెచ్చిస్తారు. గ్యాస్ ధరలు పెరిగాయని పొదుపుగా వాడుతున్నారు. అయినా ఓ రోజు వారికి మన కరెన్సీలో రూ. 19,416 కోట్ల గ్యాస్ బిల్లు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఆ యువజంట వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. ధరలు పెరిగాయని తనకు తెలుసని అయితే ఈ రేంజ్‌లో మండిపోతున్నాయని తనకు తెలియదని శ్యాం చెప్పుకొచ్చారు. సాంకేతిక లోపం వల్లే ఈ పొరపాటు జరిగిందని షెల్ ఎనర్జీ యాప్.. యువ జంటకు సర్ధిచెప్పింది.తమ యాప్ లో జరిగిన సాకేతిక లోపం వలన చాలా మంది వినియోగదారులకు ఈ తరహా బిల్లు వచ్చాయని, తరువాత ఆ లోపాలను గుర్తించి, ఓరిజనల్ బిల్లు పంపామని షెల్ ఎనర్జీ యాప్ ప్రతినిధులు తెలిపారు. ఇదే యాప్‌లో కస్టమర్ల డైరెక్ట్ డెబిట్ చెల్లింపులపై ఇది ప్రభావం చూపదని వివరణ ఇచ్చారు. షెల్ ఎనర్జీ యాప్‌లో వచ్చిన ఈ భారీ బిల్లు చూసి వారి గుండె గుభేల్‌మంది. ఈ తరహా బిల్లు నిజమే అయితే తమకు గుండె పోటు వచ్చేదని వారు చెప్పుకొచ్చారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.