నగర, పట్టణ ప్రాంతాలు, జనావాస ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన నిషేధం. అందుకే భారత్ తో సహా, అనేక దేశాల్లో పబ్లిక్ టాయిలెంట్లు అందుబాటులోకి వచ్చాయి. అయినా కొందరు నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విస్జరన చేస్తుంటారు. మరికొందరు దారుణంగా రద్దీ ప్రాంతాల్లో ఉండే గోడలపై కూడా మూత్ర విస్జరన చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టిన కూడా కుక్కతోక వంకరా అన్నట్లుగానే గోడలపై, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్నారు. రెయింబవళ్లు జనసంచారం ఉండే నగరాల్లోని ప్రజలకు ఇదో ఇబ్బందికర సమస్యగా మారింది. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు లండన్ నగరంలోని వెస్ట్ మినిస్టర్ సిటీ కౌన్సిల్ ఓ వినూత్న పరిష్కార మార్గాన్ని కనిపెట్టింది.
లండన్ పరిధిలోని సాహో నగరంలోని దాదాపు 400 ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. అలానే 24 గంటలూ నడిచే బార్లు, హోటళ్లు, థియేటర్లు, ఇతర నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే టాయిలెట్స్ సదుపాయం ఉన్న కూడా కొందరు రహదారుల వెంబడి ఉండే గోడలపై మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో అటుగా వెళ్తున్న జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడి నుంచి వచ్చే చెడువాసనలను భరించలేకపోతున్నారు. ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేందుకు లండన్ అధికారులు ఏటా రూ.10 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. అయినా సమస్యకు పరిష్కారం కాకపోవడంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో లండన్ సిటీలోని వెస్ట్ మినిస్టర్ సిటీ కౌనిల్స్ కొత్త పరిష్కార మార్గాన్ని కనిపెట్టింది.
లండన్ నగరంలోని సోహో ప్రాంతంలో ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లోని బయటి గోడలపై నీటిని వికర్షించే ఈ పారదర్శక పెయింట్ ద్రావాణాన్ని స్పే చేయించారు. ఈ పెయింట్ గల గోడలపై నీళ్లు పడినప్పుడు.. వెంటనే వెనక్కు చిమ్ముతాయి. సోహాలోని 10 ముఖ్య ప్రదేశాల్లో పాలనా యంత్రంగాం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈ ప్రయోగం గతంలో జర్మనీలో చేయగా విజయవంతం అయింది. తాజాగా లండన్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వినూత్న మార్గాన్ని అవలంభిస్తోన్నారు. ఈ కొత్త పద్ధతి ద్వారా బహిరంగ మూత్ర విసర్జనకు పరిష్కారం లభించినట్లు అవుతుందని లండన్ ప్రభుత్వం భావిస్తుంది. అదే విధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు అక్కడి అధికారులు చర్యలు చేపట్టారు. బహిరంగా మూత్ర విసర్జన నివారించేందుకు లండన్ అధికారులు చేపట్టిన ఈ కొత్త పద్ధతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.