ఆలోచన కొత్తగా ఉంటే పాత వస్తువులను కూడా అమ్మి డబ్బు సంపాదించవచ్చు. మనిషిలో కలిగే ఆలోచనలే వారి స్థితిగతులను నిర్ణయిస్తాయి. ఎంతో మంది పేదరికంలో ఉన్నప్పటికి తమ సరికొత్త ఆలోచలతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తాజాగా ఓ యువతి వాడేసిన బట్టలతో వ్యాపారం చేసి లక్షల సంపాందిస్తోంది. మరి ఎలా ఆమె ఎవరు? ఆమెకు వచ్చిన ఆసరికొత్త ఆలోచన ఏమిటి? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
బ్రిటన్‌కు చెందిన 27ఏళ్ల లిజ్జీ గ్రూమ్ బ్రిడ్జ్ అనే మహిళకు ముగ్గురు పిల్లలు. కరోనా టైమ్‌లో ఆమెకు జాబ్ కోల్పోయింది. దీంతో ముగ్గురి పిల్లల పోషన కష్టంగా మారింది. ఏం చేయాలన్నా బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒక్కో రోజు తినడానికి తిండి కూడా దొరికేది కాదు. చాలా ఆలోచించి ఓ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది.తన దగ్గర ఉన్న బట్టలను అమ్మేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంది. తన బట్టలను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది.
అయితే లీజ్జీ.. ఓన్లీ ఫ్యాన్స్ అడల్ట్ సైట్‌లో సభ్యురాలిగా చేరి.. తన బట్టల్ని అమ్ముకోవడం మొదలుపెట్టింది. ముందు ఆమె బట్టలను ఎవరు కొనలేదు. పైగా వాడిన బట్టలు ఎవరు కొంటారు అని హేళన చేశారు.అయినా సరే తన విశ్వాసాన్ని కోల్పోలేదు లీజ్జీ. తానే మోడల్‌గా మారి.. బట్టలు తానే వేసుకుని పోజులు ఇచ్చింది. దీంతో ఆమె బట్టలకు క్రేజ్ వచ్చింది. కస్టమర్లు కూడా ఎగబడి కొన్నారు. దీంతో ఆమె అసలు రేటు కన్నా.. ఎక్కువ రేట్లు పెట్టి అమ్మేసింది.. ఇప్పుడు లక్షాధికారి అయ్యింది. తాను జాబ్ చేస్తే ఎంత సంపాదించేదో.. అంతకన్నా.. పది రెట్లు సంపాదిస్తోంది. ఈ బిజినెస్ తనకు మాత్రమే కాదు ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది అని అంటున్నారు.
అంతేకాదు.. తనలా ఇంకెవరైనా ఈ జాబ్ చేసుకోవచ్చినా చెబుతున్నారు. బట్టలు డిఫరెంట్‌గా ఉంటేనే కస్టమర్లు లైక్ చేస్తారు అని అంటోంది లీజ్జీ. మొదట్లో ఎంతో మంది ట్రోల్ చేసినా తనకు మాత్రం ఈ వ్యాపారం సక్సస్ ఫార్ములాగా మారింది అని చెబుతోంది. తనలా ఎవరైనా చేయాలనుకుంటే సాయం చేస్తానంటోంది.మరి..ఓ ఆలోచనతో లక్షధారిగా మారిన లీజ్జీపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.