పది కోట్ల పుస్తకాలు…
211 ఏళ్ల చరిత్ర – పురాతన పత్రాలు…
3 వేల మందికి పైగా సిబ్బంది – మొత్తం 14 కోట్ల వస్తువులు…
ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయం!
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్!..
పుస్తకాలతోపాటు సీడీలు, పురాతన పత్రాలు, మ్యాపులూ, వీడియోలు ఇలాంటివన్నమాట. కేవలం పుస్తకాల సంఖ్యే 10,90,29,769. ఈ పుస్తకాలన్నీ ఎంత స్థలాన్ని ఆక్రమిస్తాయో తెలుసా? వీటిని పేర్చిన అరలన్నీ కలిపితే 1046 కిలోమీటర్ల పొడవుంటాయి. గ్రంథాలయం నిర్వహణకు 3,597 మంది సిబ్బంది పనిచేస్తారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 1800 సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం దీన్ని కేవలం 5000 డాలర్లతో ప్రారంభించింది.
‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’ గా పిలిచేదీంట్లో మొత్తం 14 కోట్ల వస్తువులు ఉన్నాయి. పుస్తకాలతోపాటు సీడీలు, పురాతన పత్రాలు, మ్యాపులూ, వీడియోలు ఇలాంటి చాలా ఉన్నాయి. దీన్ని ప్రారంభించిన పన్నెండేళ్ల తర్వాత బ్రిటిష్ సైనికులు యుద్ధం చేసి దీనిలోని చాలా పుస్తకాలను, వస్తువులను తీసుకొని వెళ్లారు. తర్వాత అప్పటి అధ్యక్షుడు థామస్ జెఫరసన్ 6000 వేల పుస్తకాలతో మళ్లీ లైబ్రరీ ప్రారంభించారు.
తర్వాత క్రమంగా పుస్తకాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 470 భాషల పుస్తకాలు ఉన్నాయి. 5,26,378 కాపీరైట్లు నమోదయ్యాయి. పాఠకుల కోసం 20 విశాలమైన గదులున్నాయి. అయిదు వేదికలు ఉన్నాయి. ఒక సినిమా థియేటర్ ఉంది. ఇప్పుడిది అత్యాధునిక సౌకర్యాలతో, కంప్యూటర్ పరిజ్ఞానంతో మూడు విశాలమైన భవనాల్లో కొలువుదీరింది. అమెరికా కాపీరైట్ సంస్థగా కూడా పనిచేస్తుంది.