England: మనకు ఏదైనా పంటి సమస్య ఉంటే ఏం చేస్తాం?.. చాలా మంది పంటి సమస్య వచ్చిన వెంటనే డాక్టర్‌ను కలిసి వైద్యం చేయించుకుంటాం. ఒక వేళ మన అందుబాటులో డాక్టర్ లేడనుకోండి.. డాక్టర్ అందుబాటులో ఉన్న చోటుకు వెళ్లి వైద్యం చేయించుకుంటాం. ఇది సాధారణంగా అందరూ చేసేదే. కానీ, ఇంగ్లాండ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా చేసింది. తన పళ్లను తానే పీకేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 పళ్లను పీకేసుకుంది.
ఇంతకీ సంగతేంటంటే.. ఇంగ్లాండ్, సఫోక్ కౌంటీలోని బురి సేయింట్ ఎడ్‌మండ్స్‌కు చెందిన డేనియల్ వాట్స్ అనే మహిళ క్రోనిక్ గమ్ డిసీజ్ అనే చిగుళ్ల సమస్యతో బాధపడుతోంది. ఈ సమస్యకు దగ్గరలోని ఓ డెంటిస్ట్ దగ్గర చికిత్స తీసుకునేది. అయితే, ఏడేళ్ల క్రితం ఆ డాక్టర్ హాస్పిటల్ మూసేసి వెళ్లిపోయాడు. ఇక అప్పటినుంచి ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. పంటి సమస్య మాత్రం తీవ్రంగా వేధించటం మొదలైంది.
డాక్టర్ అందుబాటులో లేకపోవటంతో స్వయంగా తానే వైద్యం చేసుకోవటం మొదలుపెట్టింది. సమస్య పెరిగిన ప్రతీ సారి తన పళ్లను పీక్కోవటం చేసింది. ఇలా ఇప్పటివరకు 13 పళ్లను స్వయంగా పీకేసుకుంది. ఇక, ఆమె నోట్లో 14 పళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. తన సమస్యపై డేనియల్ వాట్స్ మాట్లాడుతూ.. ‘‘ నేను ప్రతీ రోజు ఈ సమస్యతోనే కాలం వెళ్లదీస్తున్నాను.
ఎప్పుడూ నొప్పుల మాత్రలు వేసుకుంటాను. ఆఫీసుకు వెళతాను.. పిల్లల్ని చూసుకుంటాను. నవ్వటానికి కూడా నాకు అవకాశంలేదు. జనంతో మాట్లాడాలంటే అసహ్యంగా ఉంది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. డేనియల్ వాట్స్ సమస్యపై స్పందించిన స్థానిక కౌన్సిలర్ ఆమెకు వైద్యం చేయించటానికి విరాళాలు సేకరిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రైలులో అకస్మాత్తుగా మంటలు.. నదిలో దూకిన మహిళ! వీడియో వైరల్