అమెరికాలో శుక్రవారం ఉదయం వెల్లింగ్టన్-అసెంబ్లీ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న ఆరంజ్ లైన్ ట్రైన్‌లోని హెడ్ కార్ నుంచి అకస్మాత్తుగా పొగ, మంటలు చెలరేగినట్లు మసాచుసెట్స్ బే ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఎంబీటీఏ) తెలిపింది. రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ట్రైన్ ముందు భాగంలో మంటలు చెలరేగడంతో సబ్‌వే రైలును మిస్టిక్ నదిపై ఉన్న బ్రిడ్జిపై నిలిపివేశారు. బ్రిడ్జ్‌పై రైలు ఆగిపోవడంతో అందులో జనం కిటికీల నుంచి బయటకు దూకారు. ఓ మహిళ తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో ఏకంగా నదిలోకి దూకేసినట్లు అక్కడ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నదిలో దూకిన మహిళకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. మంటలు చెలరేగిన రైలు నుంచి సుమారు 200 మందిని సురక్షితంగా తరలించారు. రైలులో మంటలు ఎలా చెలరేగాయని విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. రైలుకు ఉన్న మెటర్ ప్యానల్ పట్టాలకు తగలడంతో మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. బ్రిడ్జిపై రైలు నిలిపివేయడంతో ఆరెంజ్ లైన్ ట్రైన్ సర్వీసులను నిలిపివేసినట్లు మసాచుటెస్ బే ట్రాన్స్ పోర్టేషన్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Breaking: Fire Crews on scene of Orange line train fire. #boston25 https://t.co/XvIFJB3dI1 pic.twitter.com/n5tcIlQA6e — Ted Daniel (@tvnewzted) July 21, 2022 New video shows a person in the water after an Orange Line train broke down and started smoking over the Mystic River. Riders had to climb off the train on to the tracks and walk back to the station. Witnesses say one person even jumped into the water. pic.twitter.com/Gvimj7krf9 — Rob Way (@RobWayTV) July 21, 2022