China: సహ ఉద్యోగి కదా అని పలకరించింది. ఉన్న పరిచయంతో అతడిని కౌగిలించుకుంది. అంతే! అదే ఆమె చేసిన తప్పు.. అదే ఆమెకు శాపంగా మారింది. సదరు సహ ఉద్యోగి కౌగిలి.. ఆమెకు ద్రుతరాష్ట్రుడి కౌగిలిగా మారింది. అతడు ఆమెను గట్టిగా కౌగిలించుకోవటంతో మూడు పక్కటెముకలు విరిగిపోయాయి. ఈ సంఘటన చైనాలో 2021లో చోటుచేసుంది. అయితే, తనను గట్టిగా కౌలింగచుకుని ఎముకలు విరిగిపోవటానికి కారణమైన వాడిపై సదరు మహిళ న్యాయపోరాటానికి దిగి, గెలుపు సాధించింది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని యూయాంగ్ సిటీకి చెందిన ఓ మహిళ 2021 మే నెలలో రోజూలాగే ఆఫీసుకు వెళ్లింది. అక్కడ ఓ సహోద్యోగిని పలకరించింది. అనంతరం ఇద్దరూ కౌగిలించుకున్నారు. అప్పటినుంచి ఆమెకు పక్కటెముకల దగ్గర నొప్పిరావటం మొదలైంది.
ఆఫీసునుంచి ఇంటికి పోయిన తర్వాత కూడా నొప్పి తగ్గలేదు. నొప్పి తగ్గటానికి రాత్రి పడుకునే ముందు వేడి నూనెతో రొమ్ముపై మర్థనా చేసుకుని పడుకుంది. ఐదు రోజుల తర్వాత ఆ నొప్పి విపరీతంగా పెరిగింది. ఆ నొప్పి తట్టుకోలేక ఆమె ఆసుపత్రికి వెళ్లింది. ఎక్స్ రే తీసిన వైద్యులు ఆమె పక్కటెముకలు మూడు విరిగిపోయినట్లు గుర్తించారు. చికిత్స, దాని తర్వాత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆఫీసుకు కొన్ని రోజులు లీవ్ పెట్టింది. దీంతో ఆదాయం లేక అల్లాడిపోయింది. ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న సమయంలో ఆమె తన సహోద్యోగిని కలిసి విషయం చెప్పింది. తన ఎముకలు విరగటానికి కారణమైనందుకు గానూ సెటిల్‌మెంట్ చేసుకోవాలని కోరింది. ఇందుకు అతడు ఒప్పుకోలేదు.
తన వల్లే ఎముకలు విరిగాయి అనటానికి ఆధారాలు లేవంటూ తప్పించుకున్నాడు. అతడి ప్రవర్తనతో మండిపోయిన మహిళ కోర్టును ఆశ్రయించింది. అతడిపై కేసు వేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన తుది తీర్పు వచ్చింది. జడ్జి మహిళకు సానుకూలంగా తీర్పునిచ్చాడు. ఆ వ్యక్తి 1,20,000 రూపాయలు చెల్లించాలని తీర్పిచ్చాడు. ప్రమాదం జరిగిన ఐదు రోజులు ఆమె పక్కటెముకలు విరిగేంత పని ఏదీ చేయలేదని తేలింది. హగ్ తర్వాత ఆమె ఎలా ఫీల్ అయిందో మరికొంత మంది సహోద్యోగులు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఆ దేశంలో ఆడవారికి శానిటరీ ప్యాడ్లు ఫ్రీ!.. ప్రపంచ చరిత్రలోనే తొలి దేశంగా..