సాధారణంగా ఎవరైన విడాకులు తీసుకున్న కొంతకాలం తరువాత కొత్త వారితో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం.. తన విడాకుల పార్టీలో వెయిటర్ గా వచ్చిన ఓ వ్యక్తిపై మనసు పడి పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆస్ట్రేలియాలో ఓ నగరంలో గాబ్రియెల్లా లాండోల్ఫీ అనే మహిళ నివాసం ఉంటుంది. కొన్ని కారణాల వలన తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ విడాకులు తీసుకోవడం ఆమె కు సంతోషంగా ఉంది. ఆ ఆనందాని తన బంధువు మిత్రులతో షేర్ చేసుకోవాలనుకుంది. ఈక్రమంలో తన బంధువులు, స్నేహితులను పిలిచి ఓ హోటల్ లో పార్టీ అరెంజ్ చేసింది. ఈ సందర్భంగా పార్టీకి వచ్చిన వారికి ఆహారం వడ్డింంచేందుకు జాన్ అనే వ్యక్తి వచ్చాడు. అక్కడ పార్టీ కి వచ్చిన గెస్ట్ లకు వడ్డించే సమయంలో జాన్.. గాబ్రియెల్లా ఎంతో నచ్చాడు. అతడిపై మనస్సు పారేసుకుంది. అలా ఆరోజు పార్టీ ముగిసింది.
అయితే ఆ మరుసటి రోజు పార్టీ ఏర్పాట్లపై ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు గాబ్రియోల్లాకు జాన్ ఫోన్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. ఆ తర్వాత అప్పుడప్పుడు కలుకోవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమ చిగురించింది. అలా ఇద్దరూ ఏడాది పాటు డేటింగ్ చేశారు. 2020 డిసెంబర్ లో ఇద్దరికీ ఒక కూతురు పుట్టిన తర్వాత పెళ్లితో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరి ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. వీరి విచిత్రమైన ప్రేమ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.