Abortion: కొన్ని దేశాల్లో అబార్షన్‌పై కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. అబార్షన్ ఉద్ధేశ్యపూర్వకంగా చేయించుకున్నా.. అనుకోకుండా జరిగినా కఠిన శిక్షలు తప్పవు. అలాంటి దేశాల్లో.. ఎల్ సాల్వెడార్ ఒకటి. ఈ దేశంలో అబార్షన్ జరిగిన మహిళలపై జాలీ, దయ ఉండదు. వారికి కఠిన శిక్షలు విధిస్తారు. 2008లో మన్యుయేలా అనే మహిళ అబార్షన్లను ప్రోత్సహిస్తోందన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 2010లో కస్టడీలో ఉన్న సమయంలో ఆమె కన్నుమూసింది. ఆమె ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. అదే విధంగా 2011లో ఎల్సీ అనే మహిళ అబార్షన్ చేసుకుందన్న కారణంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన కోర్టు దాన్ని హత్యా నేరంగా పేర్కొంటూ ఎల్సీకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
తాజాగా, మే నెలలో ఎస్మే అనే యువతికి అనుకోకుండా గర్భ స్రావం అయింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన కోర్టు ఎస్మేకు కూడా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక, సాల్వెడార్ దేశంలో గత 20 ఏళ్లుగా దాదాపు 180 మంది మహిళలకు కోర్టు శిక్షలు విధించింది. ప్రభుత్వం 2009నుంచి వారిలో 64 మందిని విడుదల చేసింది. అబార్షన్లపై ఉన్న కఠిన చట్టాలపై అక్కడి మహిళలు ఉద్యమం చేస్తున్నారు.
వారి ఉద్యమం ఫలితంగా ఎల్సీ, ఎస్మేలతో పాటు మరికొంతమంది శిక్షా కాలం ముగియకముందే జైలు నుంచి బయటపడ్డారు. దీనిపై ఎల్సీ మాట్లాడుతూ.. ‘‘నేను పదే పదే ఆలోచిస్తున్నాను.. ఎందుకు వాళ్లు నన్ను దోషిగా నిర్ణయించారు. ఎందుకు జైల్లో పెట్టారు. ఇది అన్యాయం కాదా?.. నేను చేసిన పని చాలా మంది చేస్తున్నారు కదా?..’’ అని ప్రశ్నించింది. మరి, అబార్షన్లపై కఠిన శిక్షలు విధిస్తున్న సాల్వెడార్ దేశంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Love: 11 ఏళ్లకే ప్రేమ.. లవర్ తండ్రిని ప్రేమించిన అమ్మాయి!..