ఓ దుర్మార్గుడు తన సొంత చెల్లెలిపై బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆ బాలిక గర్బవతి అయింది. దీనిపై స్పందించిన ఆ బాలిక తల్లిదండ్రలు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిందో తెలుసా?
సొంత చెల్లిని గర్భవతి చేసిన అన్న. వినటానికి షాకింగ్ ఉన్న ఇది నిజం. ఆ బాలిక ప్రస్తుతం 7 నెలల గర్బవతి కావడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇది కలన లేక నిజమా అనేది నమ్మలేకపోయారు. వీరికి ఏం చేయాలో తెలియక వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం సోమవారం షాకింగ్ తీర్పును వెలువరించింది. ఈ అంశం స్థానికంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే?
కేరళలోని ఓ ప్రాంతంలో ఓ అన్నాచెల్లెలు నివాసం ఉంటున్నారు. అయితే మైనర్ సోదరుడు తన సొంత మైనర్ చెల్లెలి (15) పై కన్నేశాడు. బెదిరించి గత కొంత కాలంగా అత్యాచారం చేశాడు. చివరికి ఆ మైనర్ బాలిక గర్భవతి అని తేలింది. ఇన్నాళ్లు భయంతో ఎవరికి చెప్పాలో తెలియక ఆ బాలిక ఇటీవల తల్లిదండ్రులకు జరిగిందంతా వివరించింది. ఇది విన్న ఆ బాలిక తల్లిదండ్రులు షాక్ గురయ్మారు. ఇది కలన లేక నిజమా అనేది నమ్మలేకపోయారు. దీంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక ఆ బాలిక తల్లిదండ్రులు అబార్షన్ కోసం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన జస్టిస్ జియాద్ రెహమాన్ తో కూడిన సింగిల్ బెంజ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
వైద్యులు అందించిన బాలిక మెడికల్ రిపోర్ట్ ఆధారంగా కీలక తీర్పును వెలువరించింది. బాలిక బిడ్డకు జన్మనిస్తే రాబోయే రోజుల్లో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని, సమాజంలోని కొందరు వ్యక్తులు అవమానాలకు గురి చేసే అవకాశాలు చాలా వరకు ఉంటాయని తెలిపింది. ఇక వైద్యుల రిపోర్ట్ ఆధారంగా ఆ మైనర్ బాలికకు అబార్షన్ చేస్తే ఎలాంటి ప్రాణహాని ఉండదని తెలిపింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఆ బాలిక భవిష్యత్ దృష్ఠ్యా అబార్షన్ కు అనుమతులు ఇస్తున్నట్లు కేరళ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. ఇక సొంత చెల్లిపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన నిందితుడిని పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.