ఈ భూ ప్రపంచంలో తల్లిదండ్రులు చూపించే ప్రేమను మరెవరు చూపించలేరు. బిడ్డల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు రేయింబవళ్లు కృషి చేస్తుంటారు. అంత ప్రేమగా చూసుకునే బిడ్డలు క్షణం పాటు కనిపించకపోతే అల్లాడిపోతారు.
ఈ భూ ప్రపంచంలో తల్లిదండ్రులు చూపించే ప్రేమను మరెవరు చూపించలేరు. బిడ్డల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు రేయింబవళ్లు కృషి చేస్తుంటారు. అంత ప్రేమగా చూసుకునే బిడ్డలు క్షణం పాటు కనిపించకపోతే అల్లాడిపోతారు. అలాంటిది అనుకోకుండా కొందరు పిల్లలు ఏళ్ల తరబడి దూరంగా ఉంటారు. అలా తప్పిపోయిన తమ పిల్లలు అకస్మాత్తుగా కనిపిస్తే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి మనస్సుకు హత్తుకునే ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన ద్వారకా, విశాఖకు చెందిన రవికుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అక్ష అనే పాప జన్మించింది. ఆ పాప పుట్టిన రెండేళ్లకు భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ద్వారకా విదేశాలకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి తండ్రి వద్దే పెరిగిన బాలికను కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకపల్లికి చెందిన భాగ్యలక్ష్మికి పెంచుకుంటున్నారు. నెలరోజులుగా వారి వద్దనే ఉంటున్నా బాలిక యాస ఆంధ్రప్రదేశ్ వాసులది మాదిరి ఉండటంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
అంతటితో ఆగక ఆ పాప ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయగా పోలీసులు పాపను పెంచుకుంటున్న భాగ్యలక్ష్మిని విచారించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బాలికను జిల్లా కేంద్రంలోని సీడబ్ల్యూసీ ముందు ప్రవేశపెట్టి బాలసదనంలో ఉంచారు. ఆ తరువాత పాప అక్షను.. ఆమె తల్లిదండ్రులు ద్వారకా, రవికుమార్ అక్కడి పోలీసులను ఆశ్రయించారు. వారి వద్ద ఉన్న ఆధారాలను చూపించి బాలికను అప్పగించాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు. వారి వద్ద ఉన్న అక్ష జన్మదిన ధ్రువీకరణపత్రం, తల్లిదండ్రులిద్దరి ఆధార్ కార్డు సాక్ష్యాలుగా చూపించారు.
డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీసులు, సీడబ్ల్యూసీ సమితి ద్వారా బాలికను అధికారికంగా తల్లిదండ్రులకు అప్పగిస్తారని అధికారులు సోమవారం తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చిన భాగ్యలక్ష్మిపై పోలీసులు చట్టపరమైన చర్యలు చేపడతారని తెలిపారు. ఏడేళ్ల తరువాత అమ్మ ఒడికి చేరిన బిడ్డ.. కన్నీటి పర్యంతమైంది. ఏడేళ్ల తరువాత కనిపించిన తన బిడ్డను హత్తుకుని ద్వారకా కన్నీంటి పర్యంతమయ్యారు. మరి.. ఈ మనస్సుకు హత్తుకుని ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.