పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే మధురమైన జ్ఞాపకం. అందుకే యువత తమ పెళ్లిని ఎంతో ఘనంగా, కొత్తగా నిర్వహించుకోవాలని కోరుకుంటుంది. ఇక పెళ్లి కొడుకు స్నేహితులు చేసే సందడి మాములుగా ఉండదు. తాజాగా పెళ్లిలో కొందరు యువకులు చేసిన పని అందరిని ఆగ్రహం వచ్చేలా చేసింది.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే మధురమైన జ్ఞాపకం. అందుకే యువత తమ పెళ్లిని ఎంతో ఘనంగా, కొత్తగా నిర్వహించుకోవాలని కోరుకుంటుంది. ఇక పెళ్లి కొడుకు స్నేహితులు చేసే సందడి మాములుగా ఉండదు. అయితే తమ స్నేహితుడి పెళ్లిలో కొత్త కొత్త పనులు చేస్తుంటారు. అయితే ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన రావడం మంచిదే. కానీ అది అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి. అయితే కొందరికి వెర్రి ఉంటుంది. ఆ వెర్రితో వారు ఏదో చేద్దామనుకుని చివరకు నవ్వుల పాలు అవుతుంటారు. తాజాగా ఓ పెళ్లి కొడుకు బీరుతో మంగళస్నానం చేసి.. నవ్వుల పాలయ్యారు కొందరు వ్యక్తులు. ఆ వివరాల్లోకి వెళ్తే..
నాగర్ కర్నూలు జిల్లా ఐతోల్ గ్రామంలో ఆ విచిత్రమైన సంఘటన జరిగింది. సాధారణంగా పెళ్లిల్లో వధువు, వరుడికి మంగళస్నానాలు చేయిస్తుంటారు. అది పసుపు నీళ్లతో చేయించడం మనందరికి తెలిసిందే. కానీ ఐతోల్ గ్రామంలో వరుడి స్నేహితులకు మాత్రం ఓ వింత ఆలోచన వచ్చింది. తమ స్నేహితుడికి చేయించే వెరైటీ మంగళ స్నానం అందరికి గుర్తుండాలని భావించారు. వరుడికి బీరుతో స్నానం చేయిస్తే కొత్తాగ ఉంటుందని వినూత్నంగా ఆలోచించారు. ఇంకేముందు వారి వెర్రి ఆలోచనను ఆచరణలో పెట్టారు. పెళ్లికొడుకుకి బీరుతో స్నానం చేయించారు. అంతేకాక ఆ ఘన కార్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అతడి స్నేహితులు చేసిన పనికి పెళ్లికి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. పెళ్లి కొడుకు స్నేహితులు చేసిన పనిపై అందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రెండ్ ఫాలో అయితే తప్పు లేదు కానీ ఇలా బెండు తీసే పనులు చేయవద్దని తిట్టి పోస్తున్నారు. చదువు వస్తే ఉన్న మతిపోయినట్లు ఇలాంటి అతి పనులు ఏంటనే కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన మంగళస్నానాన్ని.. ఇలా అవమానిమచడమేనా మీ తెలివి అంటూ మరికొందరు పెళ్లి కొడుకు స్నేహితులపై నిప్పులు చేరుగుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషళ్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘన కార్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.