సోషల్ మీడియా అంటే ఓ పిచ్చి.. వ్యామోహం పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ఆ మోజులో మునిగిపోతున్న వారు ఎందరో. అది వ్యసనం కూడా అవుతోంది. అలా ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు.. అవతలి వ్యక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైన వారు కూడా ఉన్నారు. ఇవన్నీ ఒకటైతే.. ఇప్పుడు చెప్పబోయే మహాతల్లి మరో ఎత్తు. ఫేస్‌బుక్ మోజులో పడి కన్న పిల్లల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఆ విషయం వేరే వాళ్లు వచ్చి చెప్పే వరకు కూడా ఆమెకు తెలీయని పరిస్థితుల్లో ఉందంటే అందరూ షాక్ అవుతున్నారు.
అసలు విషయం ఏంటంటే.. రొమేనియాలో ప్లోయిస్టి నగరంలో ఉండే ఆండ్రియా అనే మహిళ ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్‌లో ఉంది. ఎంతలా అందులో లీనమైపోయింది అంటే.. ఆమె కవలలు పదో అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా ఆమెకు తెలీదు. ఎవరో వచ్చి చెప్పిన తర్వాత తన తప్పు తెలుసుకుని విలపించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. అసలు ఆమెకు ఏం తెలియదని, వాళ్లు కిటికీ ఎక్కలేరని తెలిపింది. ప్రత్యక్షసాక్షులు మాత్రం పిల్లలు కిటికీ ఎక్కి పడిపోయారని తెలిపారు. ఈ వార్త అందరినీ కలచివేసింది.
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు వెళ్లి విషం చెప్పే వరకు ఆమెకు అసలు సంగతి తెలీదు. ఆమె తీరును సర్వత్రా విమర్శిస్తున్నారు. ఆమె పోలీసులు వెళ్లే వరకు కూడా లైవ్ ఛాటింగ్‌లోనే ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆండ్రియాను విమర్శించారు.