ఇటీవల వరుసగా ఉద్యోగాలు తొలగిస్తూ వార్తల్లో నిలిచిన ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. జుకర్ బర్గ్ మరోసారి తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు అనే వ్యాఖ్యలు .. కష్టించి ఫలితాన్ని పొందిన ప్రతి మగవానికి వర్తిస్తుంది. ఓ వ్యక్తి సామాన్యుడి నుండి సెలబ్రిటీ స్థాయికి ఎదిగేందుకు ఎంతో కష్టపడి ఉంటారు. విజయం కూడా వారిని వరిస్తుంది. స్వయం శక్తితో ఎదిగి, సొంతంగా సంస్థలను ఏర్పాటు చేసి, పది మందికి ఉపాధి కల్పించి.. ఆదర్శప్రాయులు అవుతారు. అటువంటి వారిలో ఒకరు ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్. చిన్నప్పటి నుండే కంప్యూటర్ తో పలు ప్రయోగాలు చేసి సాఫ్ట్ వేర్‌లను తయారు చేశాడు. 20 ఏళ్ల ప్రాయంలో ఫేస్ బుక్ అనే సోషల్ మీడియా వెబ్ సైట్‌ను తయారు చేశాడు. ఇది ప్రజలకు చేరువ కావడంతో అతడి పేరు మారు మోగిపోయింది.
దీని తర్వాత ఇన్ స్టాగ్రామ్ అనే మరో సోషల్ మీడియా వేదికను తీసుకు వచ్చాడు. ఈ రెండు సంస్థలను ఓ గొడుగు కిందకు తెచ్చేందుకు మెటా అనే మాతృసంస్థ ఏర్పాటు చేశాడు. అయితే ఇటీవల పలు ఉద్యోగాలు తీసేస్తూ వార్తల్లో నిలిచిన మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ .. ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే జుకర్ బర్గ్ మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య ప్రిసిల్లా చాన్ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మార్క్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతంలోనే తమకు మూడో బిడ్డ జన్మనివ్వబోతుందంటూ ప్రకటించని సంగతి విదితమే. ప్రిసిల్లా చాన్ మూడోసారి ప్రెగ్నెంట్ అయిందని, మ్యాక్స్, ఆగస్ట్ (కుమార్తెలు) కు వచ్చే ఏడాది ఓ చెల్లి రాబోతోందంటూ అని తన భార్యతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.
తాజాగా ఈ దంపతులకు పాప జన్మించింది. లిటిల్ బ్లెస్సింగ్.. అరేలియా చాన్‌కి స్వాగతం అంటూ జుకర్ బర్గ్ ప్రకటించారు. దీంతో 1 మిలియన్‌కు పైగా లైక్స్ అభినందనలు వెల్లువెత్తాయి. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో కలుసుకున్న ప్రిసిల్లా చాన్,జుకర్‌బర్గ్.. 2003 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇటీవలే పదో వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపు కున్నారు. ఆయనకు పాప పుట్డడంతో పలువురు అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు.