ఈ మద్య భూమిపైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానలు, హెలికాప్టర్లు సాంకేతిక లోపాలు, ప్రకృతి వైపరిత్యాల కారణంగా ప్రమాదాలకు గురిఅవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు.
ఈ మద్య ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు, హెలికాప్టర్లు ప్రమాదాలకు గురి అవుతున్న విషయం తెలిసిందే. టెక్నికల్ ఇబ్బందులు, సమాచార లోపం, ప్రకృతి వైపరిత్యాలు ఇలా కారణాలు ఏవైనా అకాశంలో జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు. కొన్నిసార్లు పైలెట్లు ప్రమాదాలను గమనించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలు రక్షిస్తున్నారు. తాజాగా అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు ప్రమాదానికి గురయ్యాయి. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. రాత్రివేళ శిక్షణా విన్యాసాల్లో సైన్యానికి చెందిన రెండు HH-60 బ్లాక్హాక్ హెలికాప్టర్స్ ప్రమాదానికి గురై కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడిక్కడే మరణించారని సైనిక ప్రతినిధి తెలిపారు. అయితే హెలికాప్టర్లు హఠాత్తుగా కుప్పకూలి పోవడానికి గల కారణాలు తెలియరాలేదు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫోర్ట్ క్యాంప్ బెల్ ప్రతినిధి నోండీస్ తుర్మాన్ మాట్లాడుతూ.. 101 వ ఎయిర్ బోర్న్ డివిజన్ లో భాగమైన రెండు హెచ్ హెచ్ – 60 బ్లాక్హక్ హెలికాప్టర్లు విన్యాసంలో పాల్గొన్న సమయంలో హఠాత్తుగా కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నామని అన్నారు.
ఫోర్ట్ క్యాంప్ బెల్ కి సుమార్ 48 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించామని.. ఇవి రెండూ నివాస ప్రాంతానికి సమీపంలో పొలాల్లో క్రాష్ అయ్యాయని 101 ఎయిర్ బోర్న్ డిప్యూటీ కమాండర్ జనరల్ జాన్ లూబాస్ తెలిపారు. ఒక హెలికాప్టర్ లో ఐదుగురు మరో హెలికాప్టర్ లో నలుగురు ఉన్నారని లుబాస్ తెలిపారు. మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా కాపాడుతామని కెంటుకి గవర్నర్ ఆండీ బెషిర్ అన్నారు.
9 killed in US Army Black Hawk helicopter crash in Kentucky https://t.co/wHw0voTMe7
— KCCI News (@KCCINews) March 31, 2023