ఈ మద్య కాలంలో ఆకాశ మార్గాన ప్రయాణాలు అంటే జనాలు భయపడిపోతున్నారు. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే ఆకాశంలో పలు విమానాలు, హెలికాప్టర్లు సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పైలెట్లు ప్రమాదాలను గమనించి అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు.
ఇటీవల భూమిపైనే కాదు ఆకాశ మార్గంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. విమానాలు, హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపాలు తలెత్తడం వల్లనో.. ప్రకృతి వైపరిత్యాల వల్లనో ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఆ సమయంలో పైలెట్లు సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల ప్రయాణీకుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఇటీవల పలు ఆర్మీ హెలికాప్టర్లు ప్రమాదాలకు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆర్మీ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయిన ఘటన జపాన్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..
జపాన్ లో ఓ ఆర్మీ హెలికాప్టర్ పది మంది సైనికులతో బయలు దేరింది. మియాకో ఐలాండ్ సమీపంలో టేకాఫ్ అయిన ఆర్మీ హెలికాప్టర్ యూహెర్ – 60జెఎ బ్లాక్ హాట్ టేకాఫ్ అయిన కొద్ది గంటంల తర్వాత రాడార్స్ నుంచి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. గురువారం మధ్యాహ్నం తరువాత హెలికాప్టర్ అదృశ్యం అయినట్లు జపాన్ ఆర్మీకి సమాచారం రావడంతో జపాన్ ఆర్మీ రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోన జపాన్ ఆర్మీకి ఓ దుర్వార్త తెలిసింది.. సౌతెర్న్ ఐలాండ్ లో ఉన్న సముద్రంలో హెలికాప్టర్ కి చెందిన శకలాలు లభ్యమయ్యాయి. కాకపోతే అందులో ప్రయాణించిన 10 మంది ఆర్మీ సిబ్బంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని శుక్రవారం ఆర్మీ అధికారులు తెలిపారు.
జపాన్ దక్షిణ దీవుల్లో నిఘా ఆపరేషన్ కోసం వెళ్లిన సైనిక హెలికాప్టర్ అనుకోని ప్రమాదం జరిగి సముద్రంలో కుప్పకూలిపోయినట్లు రక్షణశాఖ మంత్రి యసుకాజు హమదా శుక్రవారం స్పష్టం చేశారు. ఈ ప్రమాద ఘటన సమయంలో హెలికాప్టర్ లో 10 మంది సైనికులు ఉన్నారని.. గల్లంతయిన సిబ్బంది కోసం అన్వేషిస్తున్నామని.. ఇంకా వారి ఆచూకి తెలియరాలేదని ఆయన అన్నారు. తప్పిపోయిన వారి ప్రాణాలతో కాపాడేందుకు రక్షణ సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. చైనాను కట్టడి చేసేందుకు సైనిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న జపాన్ సైనిక హెలికాప్టర్ కుప్పకూలిపోవడం చర్చనీయాంశం అయ్యింది.
Japan’s missing military helicopter likely crashed into sea https://t.co/1DaqMetDQp
— BBC News (World) (@BBCWorld) April 6, 2023