తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టడం కలకలంరేపింది. నో ఫ్లై జోన్ ప్రాంతమైన తిరుమల కొండల మీదుగా మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలానే జరిగిందంటూ ఆగ్రహిస్తున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టడం కలకలంరేపింది. నో ఫ్లై జోన్ ప్రాంతమైన తిరుమల కొండల మీదుగా మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. అంతేకాక శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో నుంచి ఈ హెలికాప్టర్లు వెళ్లాయి. ఈఘటనతో అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుమల కొండలపై విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఓ సారి విమానాలు శ్రీవారి ఆలయం మీద నుంచి వెళ్లిన ఘటనలు జరిగాయి.
తిరుమల కొండలపై, అలానే శ్రీవారి ఆలయ సమీపంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం అపచారంగా భావిస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై రాకపోకలపై నిషిద్ధం ఉంది. తిరుమల కొండపై దేవతలు విహరిస్తుంటారని… అందుకే ఆ ప్రాంతంలో విమానాలు నిషేధమంటున్నారు పండితులు. మొత్తానికి తిరుమలపై అరుదుగా ఎగిరే విమానాలు భక్తుల ఆందోళనకు కారణమవుతున్నాయి. కడప నుంచి చెన్నైకి వెళ్లే సమయంలో తిరుమల కొండలపై నుంచి ఈ హెలికాప్టర్లు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.