అనంత విశ్వం ఎన్నో వింతలు, విశేషాలకు పుట్టినిళ్లని మనకు తెలుసు. ఇందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికితే.. మరికొన్నింటికి దొరకవు. అందులో ‘రక్తపిశాచి’ ఆనవాళ్లు ఒకటి. ఇవి నిజంగా ఉన్నాయా? అంటే.. అలాంటివి బయటెక్కడా కనిపించవ్.. ఒక్క సినిమాల్లో తప్ప. అయితే.. గతంలో అవి నిజంగా ఉన్నట్లు తెలిపే ఆనవాళ్లైనా.. వాటి అస్థికలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆ వివరాలు.. పోలాండ్, టోరన్ లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఇలాంటి విషయాలపై ఎప్పటినుంచో పరిశోధన చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ అనే గ్రామంలోని ఓ స్మశానానికి అనుకుని ఉన్న నిర్జన ప్రదేశంలో ఒక సమాధిని గుర్తించారు. ఆపై.. తవ్వకాలు జరిపి.. అది 17వ శతాబ్దానికి చెందిన ఒక యువతి అస్థిపంజరంగా నిర్ధారించుకున్నారు. మెడ చుట్టురా కొడవలి చుట్టి, ఆమె ఎడమ పాదం బొటనవేలుకి తాళం వేసి ఉంది. అందువల్లనే దీన్ని రక్తపిశాచిగా అనుమానిస్తున్నారు. ఇవి ఆగష్టులోనే బయటపడ్డప్పటికీ.. అందుకు సంబంధించిన డాక్యుమెంటరీ, ఫొటోలను తాజగా బయటపెట్టారు.