గత కొంత కాలంగా అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. కొంత మంది ఉన్మాదులు అమాయకులపై కాల్పులు జరుపుతూ మారణ హోమం సృష్టిస్తున్నారు. అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. టెక్సాస్‌లోని ఉవాల్డేలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో 18 ఏండ్ల సాల్వడోర్ రామోస్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ మారణకాండలో పలువురు చనిపోగా చిన్నారులు గాయపడ్డారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ తెలిపారు. వివరాల్లోకి వెళితే..
నాలుగో తరగతి చదువుతున్న మియా సెర్రిల్లో టెక్సాస్‌లోని రాబ్ ఎలిమెంట్రీ స్కూల్లో చదువుతుంది. మియా సెర్రిల్లో స్కూల్ కి వెళ్లి చదువుతున్న సమయంలో ఒక ఉన్మాది తుపాకితో వచ్చి కాల్పులు ప్రారంభించాడు. తన తోటి పిల్లలు, టీచర్లు చనిపోయారు. ఇక చావు తన వరకు వస్తుందని గమనించిన మియా సెర్రిల్లో సమయస్ఫూర్తి ప్రదర్శించింది. రక్తాన్ని చేతులకు, శరీరానికి రాసుకుంది. కొద్దిసేపు ఊపిరి బిగపట్టుకొని శవంలా నటించింది. ఆ దుండగుడు మియా వద్దకు వచ్చి చనిపోయిందనుకొని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
కొద్ది సేపటి తర్వాత ఉన్మాది అక్కడ నుంచి వెళ్లిపోగానే టీచర్ చేతిలోని ఫోన్ తీసుకుని 911 ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో పాప చూపించిన ధైర్యానికి నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.