ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అస్తవ్యస్థం చేసింది. చైనా నుంచి ప్రబలిపోయిన కరోనా ప్రపంచ దేశాలన్నింటిని గజ గజలాడించింది. కరోనా సమయంలో మనిషిని చూస్తే మనిషి భయపడే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో చాలా మంది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలు ఇంటి నుంచే అంటే వర్క్ ఫ్రమ్ హోం చేశారు. ఈ మద్య కాలంలో కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ సిస్టమ్ తీసివేస్తున్నారు.
కొంత మందిలో ఇంకా కరోనా భయం పోకపోవడంతో తాము ఆఫీస్ కి రాలేమని చెబుతున్నారు. మరికొంత మంది తాము ఇంటి వద్ద నుంచే పనిచేస్తామని.. లేదంటే రిజైన్ చేసి వెళ్లిపోతామని బెదిరిస్తున్నారు. తాజాగా తన ఎంప్లాయిస్ విషయంలో ఎలన్ మాస్క్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇది చదవండి: Gujarat: ఇదెక్కడి చోద్యం.. తనని తానే వివాహం చేసుకోబోతున్న యువతి!
తమ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయిస్ ఇక నుంచి ఇంటి వద్ద ఉండి పనిచేయడం కుదరదని, ఇది సరైన పద్దతి కూడా కాదని ఆయన తన ఈ మెయిల్ లో పేర్కొన్నారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే నిరభ్యంతరంగా చెప్పొచ్చని.. ఆఫీస్ కి రాలేమని అంటే కంపెనీ విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి వస్తుందని అన్నారు. ఇక నుంచి రిమోట్ వర్క్ లేదా వర్క్ ఫ్రమ్ హూమ్ ని అంగీకరించే ప్రసక్తే లేదని అన్నారు. ఎవరు ఎక్కడ ఉన్నా అందరూ టెస్లా ఆఫీస్ కి వచ్చి విధులు నిర్వర్తించాల్సిందే అన్నారు. ఆఫీస్ లో వారానికి కనీసం నలభై గంటల సేపు పనిచేయాల్సిందే అన్నారు.
ఇది చదవండి: అద్భుతం చేసిన వైద్యుడు..! 54 ఏళ్ల తర్వాత కంటి చూపు పొందిన వ్యక్తి!
ఒకవేళ ఆఫీస్ కి వచ్చి ఏదైనా కారణాల వల్ల పనిలో మినహాయింపు కావాలీ అంటే తాను స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని.. అలా తాను అనుమతించిన వారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని అన్నారు. ఎలాన్ మస్క్ నుంచి వచ్చిన ఈ ఈ-మెయిల్ హెచ్చరిక ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. టెస్లా ఉద్యోగుల్లో ఇప్పుడిది తీవ్ర చర్చనీయాంశమైంది.
I have yet to see an ESG list that *isn’t* fraudulent
— Elon Musk (@elonmusk) June 1, 2022
Elon to Tesla team: no more remote work pic.twitter.com/aSmZAAOm7G
— Whole Mars Catalog (@WholeMarsBlog) June 1, 2022