ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇలాంటి పదాల గురించి అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ఏ ఒక్కరిని కదిలించినా కూడా మా స్వేచ్ఛ, మా ఫ్రీడమ్ అని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ అనేది తప్పనిసరి. కానీ, స్వేచ్ఛ హద్దురు దాటితే కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురౌతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన గురించి విన్నాక మీరు కూడా అలాగే అనుకుంటారు. అక్కడ పరిస్థితులు చూసి దేశం మొత్తం నోరెళ్లబెడుతోంది. స్కూల్ కి వెళ్లే టీనేజ్ విద్యార్థులు పిల్లలకు జన్మనిస్తున్నారు. అంతేకాకుండా పిల్లలతోనే స్కూల్ కి కూడా వెళ్తున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
ఏదైనా పాఠశాల పక్క నుంచి వెళ్తుంటే మీకు పిల్లల గోల, కేకలు వినిపిస్తూ ఉంటాయి. కానీ, అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో లో ఒక పాఠశాల ఉంది. అటుగా మీరు వెళ్తుంటే మీకు చిన్న పిల్లల ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా సగం స్కూల్ విద్యార్థులు చంటి పిల్లలతోనే పాఠశాలకు వస్తుుంటారు. అవును మీరు చదివింది నిజమే.. స్కూల్ విద్యార్థినులు పిల్లలతో పాఠశాలలకు వస్తుంటారు. వారిలో చాలా మంది 12 ఏళ్ల వయసులోనే బిడ్డకు జన్మనిచ్చారు. చాలా మంది 19 ఏళ్లలోపు విద్యార్థినులే పిల్లలతో పాఠశాలకు వస్తున్నారు. అలాంటి వారి కోసం లింకన్ పార్క్ అనే ఈ పాఠశాల పనిచేస్తోంది.
గడిచిన మూడు దశబ్దాలలో అమెరికాలో ఈ టీనేజ్ తల్లుల ట్రెండ్ మరింత పెరిగిపోతోంది. ప్రస్తుతం అమెరికా మొత్తం ఈ ట్రెండ్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెెన్షన్ సర్వే ప్రకారం.. 2020 సంవత్సరంలో 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న యువతులలో ప్రతి వెయ్యి మందిలో 15 శాతం మంది బిడ్డకు జన్మనిచ్చారంట. అంతేకాకుండా 15 ఏళ్లలోపు ఉన్న యువతుల వివరాలను ఈ నివేదికలో పొందు పరచలేదట. అలా చూసుకుంటే ఈ లెక్కలు ఇంకా పెరిగే అవవకాశం ఉంది. అయితే ఈ లెక్కలు చూసి వారు భయపడటానికి కారణాలు లేకపోలేదు.
మహిళ ఒకసారి బిడ్డకు జన్మనిస్తే శరీరం మళ్లీ మునుపటిలా రావడం అయ్యే పనికాదు. ఆ పటుత్వం, ఓపిక మళ్లీ రావడం కష్టం. అలాంటిది 12 ఏళ్ల వయసులో పిల్లలు మరో బిడ్డకు జన్మనిస్తే వారి శరీరం ఎలా తట్టుకుంటుంది? వారి మానసిక స్థితి కూడా అగమ్యగోచరంగా మారిపోతుంది. అంతేకాకుండా ఆ వయసులో బిడ్డను కంటే వారు డిప్రెషన్ లోకి అవకాశం కూడా ఉంది. ఆ లింకన్ పార్క్ పాఠశాలలో మొత్తం 70 మంది విద్యార్థులు ఉండగా.. సగం మంది బిడ్డలకు జన్మనిచ్చిన వాళ్లేనట. వారిలో సగం మంది పిల్లల పోషణ కోసం స్వీపర్లుగా మారిపోతున్నారు.
అమెరికాలో విజృంభిస్తున్న ఈ కొత్త ట్రెండ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు చర్చలకు, భయాందోళనకు తావిస్తోంది. అంతేకాకుండా అమెరికాలో ఇటీవల వచ్చిన అబార్షన్లకు సంబంధించిన తీర్పు.. వారి భయాన్ని మరింత ఎక్కువ చేస్తోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే అమెరికాలో టీనేజ్ అమ్మల సంఖ్య మరింత పెరిగిపోతుందని చెబుతున్నారు. ఈ స్వేచ్ఛ, టీనేజ్ గర్భధారణపై వ్యతిరేక స్వరాలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. మరి ఈ కొత్త ట్రెండ్ మరింత రెచ్చిపోతందా.. ఇక్కడే బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తారో వేచి చూడాలి.