అప్ఘానిస్తాన్‌ను తాలిబన్లు రోజు రోజుకు ఆక్రమించుకుంటూ అక్కడి ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇక ఎట్టకేలకు తాలిబన్లు అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టి పూర్తిగా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా తాలిబన్ కు చెందిన ఓ ప్రతినిది సూహైల్ షహీన్ మీడియాతో మాట్లాడుతూ ఇండియాకు వార్నింగ్ ఇచ్చేంత పని చేస్తున్నాడు
విషయం ఏంటంటే..? భారత్ అప్ఘానిస్తాన్ అభివృద్ధిలో ఎంతో శ్రద్ద తీసుకుందని దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోడ్లు, ప్రాజెక్ట్‌లు వంటి అనేక అభివృద్ధి విషయాల్లో అప్ఘానిస్తాన్‌కు భారత్ ఎనలేని ఆర్థిక సహకారాలతో కూడిన తోడ్పాటును అందించిందని, ఈ విషయంలో భారత్‌ను పొగడక తప్పదన్నారు. అయితే తాలిబన్లు పొగుడుతూనే హెచ్చరికలు జారీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఇక ఇది కాకుండా భారత్ మిలిటరీ సాయంతో మమ్మల్నీ ఏదైనా చేయాలనుకుంటే బాగుండదంటూ వార్నింగ్ ఇస్తున్నారు.