సాధారణంగా విమానాల్లో స్మగ్లర్లు రక రకాల వస్తువు, కరెన్సీ లు మాత్రమే కాదు కొన్నిసార్లు జంతువులు, సర్పాలు కూడా స్మగ్లింగ్ చేస్తుంటారు. విమాన సిబ్బంది చాక చక్యంగా వ్యవహరించి అలాంటి వారిని కనిపెట్టి కటకటాల వెనక్కి నెడతారు. కానీ ఓ విమానంలో ఉల్లిపాయలు తీసుకు వచ్చినందుకు ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్ ఎయిర్ హోస్టస్ పై స్మగ్లింగ్ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..
గత కొంత కాలంగా ఇక్కడ మాంసం, చికెన్ కన్నా ఉల్లి ధరలు అధికంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో గల్ఫ్ లో చౌకగా లభిస్తున్న ఉల్లిపాయలను స్వదేశానికి తీసుకెళ్ళేందుకు కొంత మంది రక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గల్ఫ్ లోని రియాద్, దుబాయ్ నుంచి ఫిలిప్పిన్స్ రాజధాని మనీలాకు ఉల్లిపాయలు, నిమ్మకాయలతో పాటు మరికొన్ని పండ్లు, కూరగాయలను తరలించిన నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు ఫిలిప్పిన్స్ ఎయిర్ లైన్స్ సిబ్బంది పై కేసు నమోదు చేశారు.
ఇటీవల వచ్చిన వరదల కారణంగా ఉల్లి, నిమ్మ పంటలు భారీగా ధ్వంసం అయ్యాయి. దీంతో అక్కడ ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది. ఈ కారణంతో అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంతోనే ఫిలిప్పిన్స్ ప్రవాస ప్రజలు తమ స్వదేశానికి వేళ్లే సమయంలో కాస్ట్లీ బహుమతులుగా ఉల్లిపాయలను తమ వెంట తీసుకు వెళ్తున్న పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. మరోవైపు కస్టమ్స్ అధికారులు ఉల్లిగడ్డల స్మగ్లింగ్ చేస్తున్న వారిపై నిఘా పెట్టి వాటిని అరికట్టడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారు.