ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టర్కీ, సిరియా లో వచ్చిన భూకంపం ప్రళయాన్ని జనాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ తో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా మనతో గడిపిన వారు గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
విదేశంలో మరో తెలుగు విద్యార్ధి బలయ్యాడు. ఇటీవలే ఆంధ్రాకు చెందిన వీర సాయిష్ అనే విద్యార్ధి అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ చదువు కోసం వెళ్లిన యువకుడు డాక్టర్‌గా తిరిగొస్తాడనుకుంటే విగతజీవిగా తిరిగొస్తున్నాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్, ఇతర పేలుళ్లు కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు బలైపోతున్నారు. తాజాగా ఓ షిప్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది దుర్మరణం చెందారు.
ఈ మద్య వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం విషాదం నుంచి కోలుకోక ముందే పలు చోట్ల వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు.. ఏ వంటలు వండినా మొదట ఉల్లిని కట్ చేయాల్సిందే. ఉల్లి లేని కూర అసలు ఊహించలేం. అలాంటి ఉల్లి ధరలు దేశంలో కొన్నిసార్లు చుక్కలనంటితే... కొన్నిసార్లు దారుణంగా పడిపోతుంటాయి. రైతులను ఒక్కసారే కష్టాల్లోకి నెడుతాయి.
ఇక్కడ ఉల్లికి ధర లేక రైతులను కన్నీళ్లు తెప్పిస్తుంంటే.. అక్కడ మాత్రం ఉల్లి ధర ఏకంగా ఆకాశానికి ఎగబాకింది. కిలో ఉల్లి ధర రూ.1200 పెరిగి అక్కడి సామాన్య ప్రజలు ఉల్లి కట్ చేయకముందే ధరను చూసి కన్నీళ్లు పెడుతున్నారు.
ప్రపంచ దేశాలను ఇప్పుడు భూకంపాలు భయపెడుతున్నాయి. ఈ నెల 6న టర్కీ, సిరియాలో సంబవించిన భూకంపం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటి వరకు 42 వేల వరకు మరణాలు సంబవించాయని.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు..
సాధారణంగా విమానాల్లో స్మగ్లర్లు రక రకాల వస్తువు, కరెన్సీ లు మాత్రమే కాదు కొన్నిసార్లు జంతువులు, సర్పాలు కూడా స్మగ్లింగ్ చేస్తుంటారు. విమాన సిబ్బంది చాక చక్యంగా వ్యవహరించి అలాంటి వారిని కనిపెట్టి కటకటాల వెనక్కి నెడతారు. కానీ ఓ విమానంలో ఉల్లిపాయలు తీసుకు వచ్చినందుకు ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్ ఎయిర్ హోస్టస్ పై స్మగ్లింగ్ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. గత […]
పరీక్షల నిర్వహణ సమయంలో విద్యార్థులు కాపీ కొట్టకుండా చూడటం కోసం ఉపాధ్యాయులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థుల మధ్య వీలైనంత ఎక్కువ దూరం ఉండేలా చూస్తారు. ఇక స్టూడెంట్స్ పరీక్ష హాల్లోకి వచ్చే ముందే వారిని పూర్తిగా చెక్ చేస్తారు. అయితే ఈమధ్య కాలంలో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. టెక్నాలజీని వాడుకుని.. కాపీ కొట్టడానికి కొత్త కొత్త పద్దతులు కనిపెడుతున్నారు. దీని సంగతి కాసేపు పక్కకు పెడితే.. విద్యార్థులు కాపీ […]