‘గల్లెరీ’ అనే సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా 50 రకాల క్యాన్సర్లని లక్షణాలు కంటే ముందుగా గుర్తించవచ్చని మల్టీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కి ఇది అవసరమయ్యే సమాచారం ఇస్తుందని సైంటిస్టులు అంటున్నారు. ఈ రక్త పరీక్షను తయారు చేసిన గ్రెయిల్ అనే సంస్థ ఈ అధ్యయనానికి నిధులు సమకూర్చింది. అయితే ఇది యునైటెడ్ స్టేట్స్ లో అందుబాటులో ఉంది. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ టెస్ట్ చేయించుకోవాలి అని అంటున్నారు. అయితే ఇది 50 రకాల క్యాన్సర్లను ఒక్క బ్లడ్ టెస్ట్ లోనే గుర్తిస్తుంది. డానా-ఫార్బర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు, బ్రిటన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలతో కలిసి ఈ కృషి చేపట్టారు. క్యాన్సర్ ఉన్న వారు, లేని వారు మొత్తం 4,000 మందికి పైగా వ్యక్తుల నమూనాలకు ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష చేసి పరిశీలించారు.
క్యాన్సర్ సిగ్నల్ డిటెక్ట్ అవ్వగానే ఈ టెస్ట్ బాడీ పార్ట్స్ లో ఎక్కడ క్యాన్సర్ ఉంది అనేది కూడా పిన్ పాయింట్ చేసి చూపిస్తుంది. డాక్టర్ జోషువా చీఫ్ మెడికల్ ఆఫీసర్ మరియు హెడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీని వల్ల డయాగ్నసిస్ లో ముందు ముందు బాగా ఉపయోగపడుతుందని చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. మామూలుగా స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా చాలా రకాల క్యాన్సర్లు కనుక్కోలేము. ముఖ్యంగా లివర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటివి తలుచుకోవడం అవ్వదు. అయితే ఇటువంటి ఉపయోగించడం వల్ల ముందుగానే వీటిని కనుక్కొని లైఫ్ ని సేవ్ చేయొచ్చు అని అన్నారు.
పేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ తదితర 50 పైగా క్యాన్సర్లు ఇందులో ఉన్నాయి. అందులో 96 శాతం నమూనాల్లో అది ఏ రకం క్యాన్సరనేది ఈ పరీక్ష నిర్దుష్టంగా కనిపెట్టిందిట.